Abn logo
Feb 26 2021 @ 03:09AM

రోడ్డున పడేశారు

  • అమరావతి రైతుల ఆవేదన 
  • 436వ రోజుకు ఆందోళనలు

తుళ్లూరు, ఫిబ్రవరి 25: ‘కన్నతల్లి లాంటి భూములను త్యాగం చేశాం.. రాజధాని అమరావతి  కోసం భూములిచ్చిన వారిని నడి రోడ్డున పడేశారు... ప్రభుత్వం మారగానే రాజధాని మారుతుందా’ అంటూ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారంతో  అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాలని రైతులు చే స్తున్న ఉద్యమం 436వ రోజుకు చేరుకుంది. రాజధాని 29 గ్రామాలలో అమరావతి కోసం ఆందోళనలు కొన సాగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, జై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు. పెదపరిమి రైతు దీక్ష శిబిరంలో కాంగ్రెస్‌ పార్టీ  రాష్ట్ర నాయకురాలు సుంకర పద్మశ్రీ రిలే నిరాహార దీక్ష చేశారు.


Advertisement
Advertisement
Advertisement