కంటి తుడుపు చర్యలొద్దు

ABN , First Publish Date - 2022-07-05T06:09:47+05:30 IST

వర్షాకాలం రైతుల ప్లాట్లలో అభివృద్ధి పనులు ప్రారంభించటం కంటి తుడుపు చర్య అని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు అనుమానాలు వ్యక్తం చేశారు.

కంటి తుడుపు చర్యలొద్దు
బిల్డ్‌ అమరావతి అంటూ వెంకటపాలెం శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు

930 వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

తుళ్ళూరు జూలై 4: వర్షాకాలం రైతుల ప్లాట్లలో అభివృద్ధి పనులు ప్రారంభించటం కంటి తుడుపు చర్య అని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు అనుమానాలు వ్యక్తం చేశారు. తీర్పు ఇచ్చిన సమయంలో రైతుల ప్లాట్లను అభివృద్ధ్ది చేయడానికి వాతావరణం అనుకూలంగా ఉన్నా కాని లెక్క చేయకుండా ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతేనని ప్రకటించి అభివృద్ది పనులు చేయటానికి ప్రభుత్వానికి అభ్యంంతరం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో హైకోర్టు తీర్పు కూడా ఉందన్నారు. ఎకరం పది కోట్లు అమ్ముకోవటానికి అదే రెవెన్యూలో భూమి ఉంది కాబట్టి అక్కడ పనులు మొదలు పెట్టారన్నారు. గత ప్రభుత్వంలో వేసిన రాజధాని రోడ్లు పూర్తి చేయవచ్చని అన్నారు. కాని ప్రభుత్వం పనులు ముందుకు సాగని వర్షాకాలం సమయంలో  ప్లాట్ల అభివృద్ధ్ది చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. కాలం ఏదైనా గాని  చేడుతున్న పనులైన సక్రమంగా పూర్తి చేయాలని కోరారు. మూడు రాజధానుల మాట పాలకుల నోటి వెంట వస్తే అది కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. ఎవరైనా ఉన్నత న్యాయస్థానం తీర్పును గౌరవించి అమలు చే యాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పదవుల నుండి తప్పుకోవాలన్నారు. బిల్డ్‌ అమరావతి , సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌  అంటూ రైతులు మహిళలు చేస్తున్న ఆందోళనలు సోమవారం నాటికి 930 వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి వెలుగు కార్యక్రమం దీపాలు వెలిగించి నిర్వహించారు. 


Updated Date - 2022-07-05T06:09:47+05:30 IST