కోర్టు తీర్పును శిరసావహించాలి

ABN , First Publish Date - 2022-05-29T06:16:31+05:30 IST

రాజధాని నిర్మాణం కోసం తాము భూములను త్యాగం చేస్తే ప్రభుత్వం మూడు రాజధానులంటూ వేధిస్తోందని రైతులు పేర్కొన్నారు.

కోర్టు తీర్పును శిరసావహించాలి
జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న వెలగపూడి శిబిరంలో రైతులు

893వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు

తుళ్లూరు, మే 28: రాజధాని నిర్మాణం కోసం తాము భూములను త్యాగం చేస్తే ప్రభుత్వం మూడు రాజధానులంటూ వేధిస్తోందని రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోనళలు శనివారం 893వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేస్తే బహుమానంగా ఈ ప్రభుత్వం పోలీసు కేసులను ఇచ్చిందన్నారు. అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తూ అవమానిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానం తీర్పును గౌరవించాలన్నారు కోర్టు ఆదేశానుసారం ఆరునెలల్లో అమరావతి అభివృద్ధిని పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు పూచిక పుల్ల కూడా కదిలించలేదన్నారు.  ప్రభుత్వం మారితే రాజధాని మారదన్నారు. ఇప్పటికైనా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. అమరావతి  వెలుగు కార్యక్రమం కొనసాగింది. జై అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగించారు.  కాగా.. ఒంగోలులో జరిగిన మహానాడు కార్యక్రమానికి రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు పెద్దఎత్తున తరలివెళ్లారు. 


Updated Date - 2022-05-29T06:16:31+05:30 IST