వెలగపూడి శిబిరంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు
ఉన్నత న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించరా..?
892వ రోజుకు రైతులు ఆందోళన
తుళ్ళూరు, మే 27: రాష్ట్రం అంతా అడ్డగోలు పాలన నడుస్తోందని రాజధానికి 33 వేల ఎకరాలు భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం 892వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన పాలన అమరావవతిని, పోలవరాన్ని పక్కన పెట్టేంతవరకు వచ్చిందన్నారు. మూడు ముక్కల ఆటతో అమరావతిని నాశనం చేసి ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై అమరావతి నినాదాలు చేశారు.