రాజధాని రైతులపై కఠిన వైఖరి తగదు

ABN , First Publish Date - 2022-08-14T05:16:41+05:30 IST

రాజధాని అమరావతికి భూములిస్తే అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని రైతులు పేర్కొన్నారు.

రాజధాని రైతులపై కఠిన వైఖరి తగదు
తుళ్లూరు రైతు ధర్నా శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు

970వ రోజుకు చేరుకున్న ఆందోళనలు

తుళ్ళూరు, ఆగస్టు 13: రాజధాని అమరావతికి భూములిస్తే అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారం 970వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ఇచ్చినా అభివృద్ధి చేయటానికి ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. అన్నం పెట్టే రైతులను మోసం చేసిన పాలకులకు పుట్ట గతులుండవన్నారు. వందల రోజుల నుంచి నడిరోడ్డు మీద ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం  పట్టించుకోవటం లేదంటే..  రైతుల విషయంలో ఎంత కఠినంగా ఉందో ఐదుకోట్ల మంది ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. వైసీపీ తప్ప అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మేధావులు రాజధాని రైతులకు అండగా ఉన్నారన్నారు. ప్రజాభీష్టం మేరకు అమరావతిని అభివృద్ధి చేయాలన్నారు. 29 గ్రామాల్లో దీపాలు వెలిగించి నినాదాలు చేసి అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగించారు. 


Updated Date - 2022-08-14T05:16:41+05:30 IST