రాజధానిపై ఎందుకంత నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-06-30T05:11:39+05:30 IST

అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం ఎందుకంత నిర్లక్ష్యం చేస్తుందని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ప్రశ్నిస్తున్నారు.

రాజధానిపై ఎందుకంత నిర్లక్ష్యం
తుళ్లూరు శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు

925వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

తుళ్ళూరు, జూన్‌ 29: అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం ఎందుకంత నిర్లక్ష్యం చేస్తుందని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ప్రశ్నిస్తున్నారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలని నినదిస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం బుధవారం నాటికి 925వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అమ రావతి ప్రాంతంలోనే రాజధాని నిర్మాణాన్ని కొనసా గించి పూర్తిచేయాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఎందుకు దాట వేస్తూ వస్తుందని ప్రశ్నించారు. ఇందంతా చూస్తుం టే పాలకులు ఉద్దేశ్యపూర్వకంగానే కక్ష్య కట్టి అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. మూడు రాజధానులు ఆలోచనలను వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఆలోచననుంచి తొలగించాలని రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఆ భగవంతుడిని వేడుకుంటున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను  రాజధాని లేని  రాష్ట్రంలో పాలిస్తున్న ఘనత ఒక్క వైసీపీ ప్రభత్వానికే దక్కిందన్నారు. ఇకనైనా మూడు ముక్కలాటకు స్వస్తిచెప్పి, రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని, ఆ ప్రాంతంలో రైతుల ప్లాట్లను అభివృద్ధిచేసి సంబం ధిత  రైతులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. అమరావతి వెలుగు కార్యాక్రమం కొనసాగింది. దీక్షా శిబిరాల వద్ద దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తుళ్లూరు నెక్కల్లు, అనంతవరం దొండపాడు, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం, వెంకటపాలెం, ఐనవోలు తదితర  గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి.


Updated Date - 2022-06-30T05:11:39+05:30 IST