అండగా ఉండకుండా ఆందోళనలా

ABN , First Publish Date - 2020-10-21T13:59:45+05:30 IST

రాజధాని కోసం భూములు ఇచ్చి రోడ్డున పడ్డాం.. ఈ పరిస్థితుల్లో అండగా ఉండా ల్సింది పోయి.. వ్యతిరేక ఆందోళనలు చేయటం..

అండగా ఉండకుండా ఆందోళనలా

దళిత పరిరక్షణ పేరుతో అధికార పార్టీ కుట్ర

308వ రోజు ఆందోళనల్లో మహిళల మండిపాటు


తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ: రాజధాని కోసం భూములు ఇచ్చి రోడ్డున పడ్డాం.. ఈ పరిస్థితుల్లో అండగా ఉండా ల్సింది పోయి.. వ్యతిరేక ఆందోళనలు  చేయటం దురదృష్టకమని అమరా వతి ప్రాంత రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఉద్యమం మంగళవారంతో 308వ రోజుకు చేరుకుంది. పెదపరిమి, తుళ్లూరు, వెలగపూడి, మందడం, ఐనవోలు, అబ్బరాజుపాలెం, దొం డపాడు, అనంతవరం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం గ్రామాల్లో దీక్షా శిబిరాలు కొనసాగాయి. ఈ సందర్భంగా మహిళలు, రైతులు మా ట్లాడుతూ మూడు రాజధానుల కావాలని దళిత పరిరక్షణ పేరుతో అమరావతిలో అధికార పార్టీ నేతలు కుట్ర పూరితంగా ఆందోళనలు చేయి స్తున్నారని ఆరోపించారు. మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యమని చెప్తున్న వారు వారి ప్రాంతాల్లో గళం వినిపించకుండా అమరావతిలో ఎందుకు నిరసనలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతే అర్థం ఏముందని ప్రశ్నించారు. దొండపాడు శిబిరంలో దుర్గమ్మకి పూజలు నిర్వహించి రాజధాని అమరావతిని రక్షించాలని వేడుకున్నారు.  


అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మం గళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేత పూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో చేపట్టిన దీక్షలు 308వ రోజుకు చేరాయి. ఆయా కార్యక్రమాల్లో పలువురు రైతు సంఘ నేతలు పాల్గొని మద్దతు తెలిపారు.  


తాడేపల్లి మండలం పెనుమాకలో దీక్షలు 308వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. మొండి ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.  


మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు మంగళవారం నిరసనలు కొనసాగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా రాజధాని కోసం 33 వేల ఎకరాలు సమీకరించిన సందర్భాలు లేవని తెలిపారు. అయితే చంద్రబాబుపై ఉన్న ద్వేషంతో రాజధానిని ఇక్కడ నుంచి తరలించడం సరికాదని హితవు పలికారు.  

Updated Date - 2020-10-21T13:59:45+05:30 IST