అమరావతి కాదంటే.. అధోగతే

ABN , First Publish Date - 2020-10-20T14:19:09+05:30 IST

రాజధాని అమరావతిని విస్మరిస్తే అధోగతేనని రాజధాని రైతులు తేల్చి చెప్పారు. అమరావ తి రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండాలని..

అమరావతి కాదంటే.. అధోగతే

మూడు రాజధానులతో ప్రయోజనం శూన్యం

307వ రోజు ఉద్యమంలో రాజధాని రైతులు


తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ: రాజధాని అమరావతిని విస్మరిస్తే అధోగతేనని రాజధాని  రైతులు తేల్చి చెప్పారు. అమరావ తి రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండు చేస్తూ రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తోన్న ఉద్యమం సోమవారంతో 307వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, వెలగపూడి, మందడం, ఐనవోలు, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, నేలపాడు తదితర గ్రామాలలో నిరసనలు కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిని ఆంధ్రుల ఏకైక  రాజధానిగా కొనసాగిస్తూ అభివృద్ధి చేయాలన్నారు. రాజధానికి 33 వేల ఎకరాలు ఇస్తే అభివృద్ధి చేయటం ఇష్టం లేక ప్రస్తుత ప్రభుత్వం నిర్వీ ర్యం చేస్తుందన్నారు. మూడు రాజధానులతో ప్రయోజనం లేదని తెలిసినా.. అడ్డగోలుగా ముందుకు వెళ్తోందన్నారు.   


అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో చేపట్టిన దీక్షలు 307వ రోజుకు చేరాయి. ఆయా దీక్షల్లో పలువురు రైతు సంఘ నేతలు పాల్గొని మద్దతు తెలిపారు.  


తాడేపల్లి మండలం పెనుమాకలోని బొడ్డురాయి సెంటర్‌లో జరుగుతున్న దీక్షలు 307వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా  ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ  అమరావతి ఆరు కోట్ల ఆంధ్రుల కోరిక అన్నారు. 307 రోజులుగా దీక్షలు చేస్తున్నా మొండి ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు.  


మూడు రాజధా నులకు వ్యతి రేకంగా తాడికొండ మండ లం మోతడక గ్రా మంలో రైతులు, మ హిళలు సోమవా రం నిరసనలు తెలి పారు.  ప్రభుత్వం రైతులతో సమావే శమై వారి సమస్య లను పరిష్కారిం చాలని డిమాండ్‌ చే శారు. సచివాలయం, అసెంబ్లీ రెండు వేరు వేరు చోట్ల ఉండటా నికి వీల్లేదని, రెండు ఒకే చోట ఉండాలని డి మాండ్‌ చేశారు. 

Updated Date - 2020-10-20T14:19:09+05:30 IST