Abn logo
Oct 1 2020 @ 08:40AM

రైతుల ఉసురు తగిలితే కష్టమే

Kaakateeya

288వ రోజు ఆందోళనల్లో మహిళా జేఏసీ సభ్యులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): రైతులు ఉసురు తగిలిన ఏ ప్రభుత్వాలు మునుగడ సాగించిన దాఖలాలు చరిత్రలో లేదని మహిళా జేఏసీ సభ్యులు రాయపాటి శైలజ, కంభంపాటి శిరీష లు తెలిపారు. రాజధాని అమరావతి కొనసాగాలని రైతులు, రైతు కూలీలు చేస్తోన్న ఉద్యమం బుధవారంతో 288వ రోజుకు చేరింది. అమరావతి కొనసాగాలని లింగాయపాలెంలో రెండో రోజు హనుమాన్‌ చాలీసా పఠనం, పూజలు నిర్వహించారు. అబ్బరాజుపాలెం, బోరుపాలెం, నేలపాడు, తుళ్లూరు, అనంతవరం, దొండపా డు, మందడం, లింగాయపాలెం, వెలగపూడి, ఐనవోలు తదితర గ్రామాలలో రైతులు ఆందోళనలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానులను ప్రతిపాదిస్తున్నార న్నా రు. పెదపరిమి శిబిరంలో రాష్ట్ర తెలుగు రైతు నాయకులు నూ తలపాటి రామారావు మాట్లా ్లడుతూ జగన్‌ మొండి వైఖరి విడనాడి అమరావతిని అభివృద్ధి చేస్తే ప్రజల్లో ఆదరణ ఉంటుందన్నారు.  


అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించా లని కోరుతూ మంగళగిరి మండలం కృష్ణాయ పాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నీరుకొండ, ఆత్మకూరు గ్రామాల్లో దీక్షలు 288వ రోజు కొనసాగాయి. దీక్షల్లో రైతు సంఘ నాయ కులు కిరణ్‌, ఉమామహేశ్వరరావు, వీరాంజ నేయులు, సీహెచ్‌ శ్రీనివాసరావు, ఎన్‌ నాగేశ్వ రరావు, అరుణ, సాంబశివరావు, వెంకటేశ్వ రరావు, అశోక్‌, కుమారి, బిందు, ఎన్‌ పద్మ, కుసుమ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం బొడ్డురాయి సెంటర్‌లో ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 288వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో కళ్లం రాజశేఖర్‌రెడ్డి, పఠాన్‌ జానీఖాన్‌, ముప్పెర మాణిక్యాలరావు, షేక్‌ సాబ్‌జాన్‌, మన్నవ వెంకటేశ్వరరావు, గోగినేని నాగేశ్వరరావు, మేకా సాంబిరెడ్డి, మన్నవ సు బ్బారావు, బత్తుల బుల్లెబ్బాయి, మోదుగుల తాతయ్య, తదితరులు పాల్గొన్నారు. 


మూడు రాజధానులకు వ్యతి రేకంగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామ రైతులు, మహిళలు బుధవారం నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ సీఎం జగన్మో హనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానులతో రాష్ట్రానికి ముప్పు వాటి ల్లుతుందని రైతులు, మహి ళలు ఆరోపించారు. 
Advertisement
Advertisement