అమరావతి: నాటుసారా మరణాలపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఐదోరోజు సోమవారం ఫ్లకార్డులతో ఆందోళన చేశారు. సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేసి నిరసన తెలిపారు. మద్య నిషేధం హామీ గోవిందా.. గోవిందా అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీలో అసత్య ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ బ్రాండ్‌లు వెంటనే రద్దు చేయాలని, ప్రజల ప్రాణాలు తీస్తున్న కల్తీ సారాను అరికట్టాలని, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి