Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 30 Mar 2022 14:25:34 IST

ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ సమీక్ష

twitter-iconwatsapp-iconfb-icon
ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఓ కొలిక్కి వచ్చిందా? కొత్త జిల్లాలో ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ అయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ సమీక్ష చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై  కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలను ఉగాది రోజున ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎల్లుండి (శుక్రవారం) నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే జిల్లాల విభజనపై అధికారపార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. జిల్లా కేంద్రాల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, పేర్ల మార్పుపై అసంతృప్తి జ్వాల రగులుతోంది. పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలకు పలువురు అధికార పార్టీ నేతలే నేతృత్వం వహిస్తున్నారు.


అలాగే రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో పలు రెవెన్యూ డివిజన్లను తొలగించింది. ఏపీలో రెండో అతి పెద్ద రెవెన్యూ డివిజన్ అయిన ప్రకాశం జిల్లాలోనే కందుకూరుకు సయితం ఆ హోదా తొలగించారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. అటు పోలీస్ శాఖలోని విభజనకు కసరత్తులు జరుగుతున్నాయి. మరోవైపు ఆర్థిక శాఖ కూడా ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేస్తోంది. మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇవాళ ముఖ్యమంత్రి జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.