Abn logo
Jul 22 2021 @ 17:37PM

అమరావతి భూముల కేసులో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. పిటిషన్ ఉపసంహరణ

న్యూఢిల్లీ: అమరావతి భూముల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై గతంలో సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. 4 వారాల్లో విచారాణ ముగించాలని ఏపీ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది. హైకోర్టులోనే కౌంటర్ దాఖలుకు అనుగుణంగా పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. 7 నెలలైనా ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పుడే తమకు తెలివి వచ్చిందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది అన్నారు.