Amaravathi JAC: ఆందోళన తప్ప మాకు మరో మార్గం లేదు

ABN , First Publish Date - 2022-08-08T20:43:43+05:30 IST

వేతనాలు, పెన్షన్ల కోసం ఆందోళకు దిగాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతోందని అమరావతి జేఏసీ పేర్కొంది.

Amaravathi JAC: ఆందోళన తప్ప మాకు మరో మార్గం లేదు

అమరావతి (Amaravathi): ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్‌లకు పెన్షన్‌ల కోసం ఆందోళకు దిగాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతోందని, తమకు ఆందోళన తప్ప మరో మార్గం లేదని అమరావతి జేఏసీ నేతలు (JAC Leaders) అన్నారు. సోమవారం అమరావతి జేఏసీ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో 90 సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju), ప్రధాన కార్యదర్శి వైవి రావు (YV Rao) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) తో మాట్లాడుతూ ఉద్యోగులు (Employees) దాచిపెట్టుకున్న సొమ్ము కూడా ప్రభుత్వం వాడేసుకుందని, తమ సొమ్ము కావాలని అడిగితే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వండనే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక ఆందోళనలకు సిద్దమవుతామని స్పష్టం చేశారు. పెన్షనర్‌ల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. 25వ తేదీ వరకూ పెన్షన్‌లు పడటం లేదని, ఉద్యోగులకు 8వ తేదీ నాటికి కూడా కొంతమందికి జీతాలు పడలేదని చెప్పారు. ఉద్యోగులు దాచిపెట్టుకున్న సొమ్మును కూడా ప్రభుత్వం వేరే ప్రాధాన్యతలకు వాడుతోందని  తమకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని తెలిపారు. ఆర్‌టీసీ ఉద్యోగులకు కొత్త వేతనం ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మంత్రుల కమిటీ సమావేశంలో ఎటువంటి హామీ ఇవ్వడం లేదన్నారు. ఇక తమకు ఆందోళన తప్ప మరో మార్గం లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవి రావులు మరోసారి స్పష్టం చేశారు.

Updated Date - 2022-08-08T20:43:43+05:30 IST