ఏపీలో 5 తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు

ABN , First Publish Date - 2020-08-02T16:59:08+05:30 IST

ఏపీలో 5 తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు

ఏపీలో 5 తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెల జీతం ఆలస్యంకానుంది. ఈ నెల 5 తరువాతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే అవకాశం ఉంది. అలాగే 8 నాటికి పెన్షనర్లకు పెన్షన్లు అందనున్నాయి. గత నెలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.  రాష్ట్ర ఖజానాలో నిలువ వెయ్యి కోట్ల రూపాయలే ఉండగా...ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి 5వేల 500కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. ఉద్యోగుల జీతాలు 3వేల200 కోట్లు, పెన్షన్లర్లకు పెన్షన్లు 13 వందల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సోమవారం సెలవు కావడంతో మంగళ, బుధ వారాలలో బాండ్ల వేలం ద్వారా  ప్రభుత్వం నిధులు సేకరించనుంది. నిధుల సౌలభ్యం ఆధారంగా జీతాలు విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2020-08-02T16:59:08+05:30 IST