అమరావతి: సీఆర్డీఏ, ఏపీ రేరాకు రాజధాని రైతుల నోటీసులు

ABN , First Publish Date - 2022-03-20T20:04:29+05:30 IST

అమరావతి: సీఆర్డీఏ, ఏపీ రేరాకు రాజధాని రైతులు నోటీసులు ఇచ్చారు.

అమరావతి: సీఆర్డీఏ, ఏపీ రేరాకు రాజధాని రైతుల నోటీసులు

అమరావతి: సీఆర్డీఏ, ఏపీ రేరాకు రాజధాని రైతులు నోటీసులు ఇచ్చారు. భూ సమీకరణ ఒప్పందం ప్రకారం రైతుల ప్లాట్లను.. మూడేళ్లలోగా అభివృద్ధి చేయాలని నిబంధన ఉంది. అభివృద్ధి చేయకపోవడంతో జీవనోపాధి కోల్పోయామని రైతులు పేర్కొంటూ ఎకరానికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని నోటీస్‌లో పేర్కొన్నారు. రైతుల తరపున సీఆర్డీఏ, ఏపీ రేరాకు హైకోర్టు న్యాయవాది ఇంద్రనీల్‌ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. సీఆర్డీఏ ప్రాజెక్ట్‌ను ఎందుకు తీసుకోలేదని ఏపీ రేరాకు లీగల్‌ నోటీసులు ఇచ్చారు. రైతుల నివాస స్థలాలకు గజానికి నెలకు రూ.50, వాణిజ్య స్థలాలకు గజానికి రూ.75 చొప్పున పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

Updated Date - 2022-03-20T20:04:29+05:30 IST