Abn logo
Feb 21 2020 @ 15:25PM

కోటప్పకొండలో మార్మోగిన రాజధాని నినాదాలు

అమరావతి: కోటప్పకొండలో రాజధాని నినాదాలు మార్మోగాయి. కమ్మవారిపాలెం, కావూరు ప్రభల్లో జై అమరావతి నినాదాలు దద్దరిల్లాయి. ప్రభల తాళ్లు పట్టుకొని రాజధాని రైతుల జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తిరునాళ్లలో మొత్తం అమరావతి సందడే నెలకొంది. రాజధాని నుంచి తరలివచ్చిన మహిళలకు, రైతులకు పలు జిల్లాల నుంచి వచ్చిన శివభక్తులు సంఘీభావం తెలిపారు. అనంతరం రాజధాని రైతులతో కలిసి భక్తులు కూడా నడిచారు. దాదాపు 2 వేల మంది రైతులు కోటప్పకొండకు పాదయాత్రగా వెళ్లారు.


అలాగే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కూడా అమరావతి కోసం ప్రదర్శన చేపట్టారు. స్థానిక ప్రజలతో కలిసి గ్రామం నుంచి బాలకోటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. జేఏసీ జెండాలతో  జై అమరావతి నినాదాలు చేసుకుంటూ ప్రదర్శనగా వెళ్లారు.

Advertisement
Advertisement
Advertisement