రాజధాని పోరు మరో కురుక్షేత్రం!

ABN , First Publish Date - 2020-08-12T14:13:08+05:30 IST

‘కురక్షేత్రం జరిగింది ఐదు ఊళ్ల కోసం కాదు దుష్ట శిక్షణ కోసం... అలానే..

రాజధాని పోరు మరో కురుక్షేత్రం!

సీఎం జగన్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలి

అమరావతి శిబిరాల్లో కృష్ణాష్టమి వేడుకలు

238వ రోజు కొనసాగిన రైతుల ఆందోళనలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ‘కురక్షేత్రం జరిగింది ఐదు ఊళ్ల కోసం కాదు దుష్ట శిక్షణ కోసం... అలానే అమరావతి పోరాటం 29 గ్రామాల కోసం కాదు... 13 జిల్లాల ప్రగతి కోసం’ అంటూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు దీక్షా శిబిరాల్లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. పాలనా రాజధాని అమరావతితోనే ఉండాలంటూ డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు మంగళవారానికి 238వ రోజుకు చేరాయి. శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని అమరావతిని కాపాడాలని, ప్రభుత్వం మనసు మారాలని శిబిరాల్లోనే కృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేసి రైతులు, మహిళలు పూజలు నిర్వహించారు. కుట్రలు, కుటంత్రాలతో రాష్ట్రానికి తల్లి లాంటి అమరావతి వలువలూడదీస్తున్నారని తుళ్లూరు రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు.


నిరసనలో భాగంగా మహాభారంతంలోని ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టాన్ని తలపించేలా... అమరావతి వస్త్రాపహరణం అంటూ నాటకంను ప్రదర్శించి తమ నిరసనను తెలిపారు.   

Updated Date - 2020-08-12T14:13:08+05:30 IST