అమరావతే రాష్ట్ర ఏకైక రాజధాని

ABN , First Publish Date - 2022-08-04T05:44:37+05:30 IST

అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అని, అమరావతి సమస్య రైతులొక్కరిదే కాదని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యయని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు.

అమరావతే రాష్ట్ర ఏకైక రాజధాని
రాజధాని గ్రామాలలో పాదయాత్ర చేస్తున్న బిజేపీ నేతలు

కేంద్ర పెద్దల ఆదేశాలతోనే  పాదయాత్ర

అమరావతి రాజధాని.. రాష్ట్ర ప్రజలందరి సమస్య

ఆరో రోజు పాదయాత్రలో బీజేపీ నేతలు

తుళ్లూరు, ఆగస్టు 3:  అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అని,  అమరావతి సమస్య రైతులొక్కరిదే కాదని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యయని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. బుధవారం రాజధాని గ్రామం నెక్కల్లు నుంచి పెదపరిమి, శాఖమూరు గ్రామాల్లో బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. శాఖమూరుకు చేరుకున్న బీజేపీ నేతలు రాత్రికి అక్కడే భసచేశారు.  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ, రైతులను ఇబ్బంది పెడుతూ, సీఎం రాక్షసానందం పొందుతున్నాడన్నారు. నేను ఉన్నాను, విన్నాను  అన్న సీఎం జగన్‌రెడ్డి ఒకసారి  రాజధానిలో పర్యటిస్తే ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమవుతుందన్నారు.  మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్‌ మాట్లాడుతూ 900 రోజులకు పైగా  ఉద్యమం చేస్తున్న  అమరావతి మహిళలకు పాదాభివందనాలన్నారు. మనంమన అమరావతి  ప్రోగ్రాం కన్వీనర్‌ వల్లూరి జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ కేంద్ర పెద్దల ఆదేశాలతోనే ఈ పాదయాత్ర జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కేంద్ర సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదన్నారు. బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని సమస్య రాష్ట్ర సమస్య అన్నారు. అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తామన్నారు. అమరావతి అభివృద్ధి పూర్తయ్యేవరకు ఉద్యమిస్తామన్నారు.  కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్ర బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాం కిషోర్‌, ఉమ్మడి రాష్ట్ర బీజేపీ, జిల్లా ఉపాధ్యక్షుడు కంతేటి బ్రహ్మయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు నమ్రత, కిసాన్‌ మోర్చా రాష్ట్ర నాయకులు కొమ్మినేని సత్యనారాయణ, జిల్లా నాయకులు చుండు రాంబాబు, గుంటూరు జిల్లా నాయకులు  ఆవుల వీర శేఖర్‌ యాదవ్‌, నాయకులు వెలగలేటి గంగాధర్‌, పాలపాటి రవి కుమార్‌, ఈదర శ్రీనివాసరావు, గోలి శ్రీనివాసరావు, తుళ్లూరు మండల అధ్యక్షుడు నీరుకొండ లక్ష్మీనారాయణ,  ఉపాధ్యక్షుడు సరిపూడి సాంబశివరావు, నాయకులు మార్తరవి,  జేఏసీ నేతలు నరసింహరావు (చిన్నా), అబ్బూరి లక్ష్మీ, కొమ్మినేని వర లక్ష్మీ ,  స్వరాజ్యరావు,  రాజధాని పరిరక్షణ సమితి కన్వీనర్‌ గద్దె తిరుపతిరావు, అధ్యక్షుడు శివారెడ్డి, రాజధాని రైతులు, మహిళలు పాల్గొన్నారు. 

నేడు తుళ్ళూరులో పాదయ్రాత ముగింపు సభ ..

బీజేపీ పాదయాత్ర ముగింపు సభ నేడు తుళ్లూరులోని సాయిబాబా కల్యాణ మండపం పక్కన ఆవరణ జరుగుతుందని బీజేపీ నేతలు ఒక ప్రకనటలో తెలిపారు. సభకు ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌,  రాజ్య సభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీ నారాయణ, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, ఆదినారాయణ రెడ్డి విచ్చేస్తున్నట్టు తెలిపారు. 


Updated Date - 2022-08-04T05:44:37+05:30 IST