Jagan vs Chandrababu: కోనసీమ జిల్లాకు జగన్.. చంద్రబాబు డిమాండ్లు ఇవే

ABN , First Publish Date - 2022-07-26T04:08:53+05:30 IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Ap Cm Jagan Mohanreddy) కోనసీమ వరద బాధితులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో..

Jagan vs Chandrababu: కోనసీమ జిల్లాకు జగన్.. చంద్రబాబు డిమాండ్లు ఇవే

అమరావతి (Amaravathi): ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Ap Cm Jagan Mohanreddy) కోనసీమ వరద బాధితులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల కోసం మాజీ సీఎం చంద్రబాబు (Ex Cm Chandrababu) పలు డిమాండ్లు చేశారు. ఈ మేరకు వరద బాధితులకు పరిహారం, రైతులకు భరోసాపై సీఎస్ సమీర్ శర్మ (Cs Sameer Sharma)కు చంద్రబాబు లేఖ రాశారు. వరదలపై CWC హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని లేఖలో పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం (Government) విఫలమైందని... ముంపు బాధితులకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం ఇవ్వాలని కోరారు. 


‘‘దెబ్బతిన్న ఇంటికి తక్షణ సాయంగా రూ.50 వేలు అందజేసి ప్రభుత్వమే ఉచితంగా ఇళ్ల నిర్మాణం చేయాలి. వరదల్లో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం ఇవ్వాలి. వరదలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి. వరికి హెక్టారుకు రూ.25 వేలు, ఆక్వాకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలి. తమలపాకు పంటకు ఎకరాకు రూ.50 వేలు, అరటి పంటకు ఎకరాకు రూ.40 వేలు పరిహారం అందించాలి. వరదల్లో మరణించిన ఆవు, గేదెలకు పరిహారంగా రూ.40 వేలు ఇవ్వాలి. వరద బాధితులు, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.’’ అని లేఖలో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2022-07-26T04:08:53+05:30 IST