Abn logo
Jul 27 2021 @ 23:37PM

అమరావతికి భూములిస్తే నానామాటలు

తుళ్లూరు శిబిరంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు

588వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు

తుళ్లూరు, జూలై 27: రాజధాని అమరావతికి భూములిస్తే గౌరవించకపోగా ప్రస్తుత పాలకులు నానామాటలు అంటున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావ తి కొనసాగాలని వారు చేస్తోన్న ఉద్యమం మంగవారంతో 588వ రోజుకు చేరుకుంది. ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ భూములు ఇచ్చిన వారిని నడి రోడ్డు మీద నిలబెట్టారని, అందుకు వ్యతిరేకంగా న్యాయదేవతను ఆశ్రయిస్తే ప్రభుత్వం తమను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులుగా  చిత్రీకరిస్తుందన్నారు. పోరాట శిబిరాలలో ఉన్న ప్రతి ఒక్కకి ఆధార్‌ కార్డు ఉందని, తాము స్వచ్ఛమైన రైతులమని తెలిపారు. పాలకులు నడిపే మూడు రాజధానుల శిబిరంలో వారిలాగా తాము పెయిడ్‌ ఆర్టిస్టులం కాదన్నారు. అమరావతి జీవన్మరణ సమస్య అని అందుకే ప్రాణాలు పోయేదాక పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. అక్రమార్కులను పాలకులే ప్రోత్సహించి రాజధాని నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్‌ను దోచుకెళ్లమంటున్నారన్నారు. అమరావతిని ఏదో ఒక రకంగా నాశనం చేయాలని సీఎం జగన్‌రెడ్డి గట్టి సంకల్పంతో ఉన్నారన్నారు. రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.