అమరావతి పరిధిలోని 29 గ్రామాల బంద్

ABN , First Publish Date - 2020-11-01T13:02:14+05:30 IST

రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ నేడు రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల బంద్‌కు రాజధాని జేఏసీ పిలుపునిచ్చింది. కృష్ణాయపాలెం రైతులను అరెస్ట్ చేసి సంకెళ్లు వేయడం, జైల్ భరో సందర్భంగా మహిళలపై పోలీసుల దాడికి నిరసనగా సంపూర్ణ బంద్ పాటించాలని ప్రజలకు జేఏసీ

అమరావతి పరిధిలోని 29 గ్రామాల బంద్

అమరావతి: రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ నేడు రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల బంద్‌కు రాజధాని జేఏసీ పిలుపునిచ్చింది. కృష్ణాయపాలెం రైతులను అరెస్ట్ చేసి సంకెళ్లు వేయడం, జైల్ భరో సందర్భంగా మహిళలపై పోలీసుల దాడికి నిరసనగా సంపూర్ణ బంద్ పాటించాలని ప్రజలకు జేఏసీ పిలుపునిచ్చింది.


ఇదిలా ఉండగా, రాజధాని జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపునకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మద్దతు ప్రకటించారు. జైల్ భరో కార్యక్రమం సందర్భంగా శనివారం నాడు మహిళలపై జరిగిన దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న దళిత, బీసీ రైతులను వెంటనే విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అమరావతి ఉద్యమంలో రైతులు, మహిళలపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-11-01T13:02:14+05:30 IST