Abn logo
Sep 20 2020 @ 09:52AM

278వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు

అమరావతి: రాజధాని కోసం రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 278వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఐనవోలు, ఉద్దండరాయని పాలెం, పెడపరిమి, దొండపాడు, నెలపాడు, ఆనంతవరం తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని  ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. 

Advertisement