ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌పై బదిలీ వేటు

ABN , First Publish Date - 2020-07-16T13:35:40+05:30 IST

ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌పై బదిలీ వేటు

ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌పై బదిలీ వేటు

అమరావతి: ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌పై బదిలీ వేటు పడింది. ఆయనకు సీఎస్ నీలం సహానీ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇటీవల ఏపీఎస్పీ బెటాలియన్ డిజీగా మాదిరెడ్డి ప్రతాప్ బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీగా బాధ్యతల నుంచి తప్పుకుంటా మీడియా సమావేశం నిర్వహించిన మాదిరెడ్డి ప్రతాప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు గల కారణాలు 7 రోజుల్లో చూపాలని నోటీసు జారీ చేశారు. రిప్లై ఇవ్వని పక్షంలో డిసిప్లినరీ యాక్షన్ చర్యలు తప్పవు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే జీఏడీకి రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2020-07-16T13:35:40+05:30 IST