LIVE: ఏపీలో వైద్య సిబ్బందికి మెమోలు...మరి వైసీపీ నేతలకు

ABN , First Publish Date - 2020-07-11T13:23:17+05:30 IST

LIVE: ఏపీలో వైద్య సిబ్బందికి మెమోలు...మరి వైసీపీ నేతలకు

LIVE: ఏపీలో వైద్య సిబ్బందికి మెమోలు...మరి వైసీపీ నేతలకు

అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీలో కరోనా పేషెంట్లకు జరుగుతున్న ట్రీట్మెంట్‌కు సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం థర్డ్ పార్టీతో సర్వే చేయించింది. ఆ సర్వేలో భాగంగా చాలా చోట్ల క్వారంటైన్ సెంటర్లలో ఉన్న రోగులకు సరైన సౌకర్యాలు అందడం లేదు. అక్కడ అధికారులు వారిని పట్టించుకోవడంలేదు వంటి విమర్శలు, ఫిర్యాదులు వచ్చిన్నట్లు నిన్న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఎవరైతే క్వారంటైన్‌ సెంటర్లు, ఆస్పత్రిలలో ఉన్న అధికారులు... రోగుల పట్ల సరైన విధంగా వ్యవహరించడం లేదో... వారిలో కొంతమందికి ఇప్పటికే మెమోలు జారీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. వారం రోజుల్లో మళ్లీ సర్వే చేయించి వారిని సస్పెండ్ చేస్తామని చెబుతోంది. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


చాలా చోట్ల సిబ్బంది సరిగా పనిచేయకపోవడానికి కారణం...ప్రభుత్వం వారికి కావాల్సిన రక్షణ సౌకర్యాలు కల్పించకపోవడం, పీపీఈ కిట్లు, మాస్కులు సరిగ్గా ఇవ్వకపోవడమని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే పలువురు సిబ్బంది ఆస్పత్రికి వెళ్లడానికి, అక్కడ ఉన్న కరోనా రోగిని చూసుకోడానికి ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. చాలా చోట్ల వైద్య సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో సరైన రక్షణ లేకుండా సేవ చేసే పరిస్థితి లేదు అన్న ఆందోళన చాలా మంది సిబ్బందిలో కనిపిస్తోంది. అలాంటి వారికి ఇప్పటికే మెమోలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. కేజీహెచ్ లాంటి ప్రాంతాల్లో ల్యాబ్ సిబ్బందికూడా కరోనా బారిన పడిన నేపథ్యంలో ల్యాబ్‌ను కూడా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. 


ఈ తరహా వాతావరణ నేపథ్యంలో ముందుగా సిబ్బందికి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం, వాళ్లకు కావాల్సిన రక్షణకు సంబంధించి పీపీఈ కిట్లు వంటివి ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టి పెట్టకుండా...కేసులు పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి మెమోలు ఇవ్వడంపైన విమర్శలు వస్తున్నాయి. వైద్య సిబ్బందికి ధైర్యాన్ని ఇచ్చేలా ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే సమయంలో వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చాలా మంది కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక మంత్రి తనయుడికి కూడా కరోనా వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో కొంతమంది ప్రజాప్రతినిధులకు కరోనా వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.


వీటిని అధికారంగా ప్రకటించకపోయినప్పటికీ వీరందరూ కూడా ప్రజలు అందిరితో కలిసి తిరిగారు. దీంతో ఆ ప్రజల పరిస్థితి ఏంటి?...అక్కడ అధికారులు పరిస్థితి ఏంటి? అనే ఆందోళన నెలకొంది. ఓ వైపు ప్రజాప్రతినిధులు కోవిడ్ వ్యాప్తికి కారణం అవుతున్నారు. మరోవైపు కోవిడ్ పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేస్తున్న సిబ్బందికి సరైన కాన్ఫిడెన్స్, రక్షణ సౌకర్యాలు లేవు. వాళ్లకు ఓపక్క మెమోలు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారు అనే ఒక వాతావరణం ఏపీలో ఉన్న నేపథ్యంలో ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ చేపట్టారు.  ఈ చర్చలో టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నరహరిశెట్టి నరసింహారావు, బీజేపీ తిరుపతిరావు పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated Date - 2020-07-11T13:23:17+05:30 IST