సర్పంచ్‌ భర్తపై వైసీపీ నేతల దాడి

ABN , First Publish Date - 2021-06-15T05:43:19+05:30 IST

మండలంలోని ఉంగుటూరు గ్రామ సర్పంచ్‌గా తెలుగుదేశం మద్దతుతో గెలుపొందిన మేదరమెట్ల అనురాధ భర్త సోమశేఖర్‌పై సోమవారం వైసీపీ నాయకులు కర్రలతో దాడి చేసి గాయపరిచారు.

సర్పంచ్‌ భర్తపై వైసీపీ నేతల దాడి
వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ సర్పంచ్‌ భర్త సోమశేఖర్‌

అమరావతి, జూన్‌ 14: మండలంలోని ఉంగుటూరు గ్రామ సర్పంచ్‌గా తెలుగుదేశం మద్దతుతో గెలుపొందిన మేదరమెట్ల అనురాధ భర్త సోమశేఖర్‌పై సోమవారం వైసీపీ నాయకులు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. సోమశేఖర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తాను గ్రామంలోని చెరువు చుట్టూ ఉన్న ముళ్లకంపను ఎక్స్‌వేటర్‌తో తొలగిస్తుండగా వైసీపీ నాయకులు రాయపాటి సాంబశివరావు, ధర్మతేజ పనులకు అడ్డుతగిలి దాడి చేశారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో శివ భార్య ఓటమి చెందడంతో తమపై కక్ష పెంచుకున్నాడని పేర్కొన్నారు. ఆ సమయంలో అడ్డుకున్న నల్లూరి శ్రీహరి అనే వ్యక్తిపై దాడి చేసి అతని కారు అద్దాలు పగుల గొట్టారని తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజేష్‌కుమార్‌, ఎస్‌ఐ కోటేశ్వరరావు తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై కఠినచర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గ్రామంలో పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. గ్రామంలోకి పోలీసు అధికారులు వచ్చిన తరువాత కూడా వైసీపీ వర్గీయులు తెలుగుదేశం వర్గీయుల ఇళ్లపైకి దాడికి వెళ్లగా పోలీసులు వారిని అక్కడనుండి తరిమి వేశారు. 

Updated Date - 2021-06-15T05:43:19+05:30 IST