న్యాయమే గెలుస్తుంది

ABN , First Publish Date - 2020-09-20T14:24:17+05:30 IST

రాజధానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల పక్షాన న్యాయం ఉందని రైతులు..

న్యాయమే గెలుస్తుంది

మూడు రాజధానులతో ఒరిగేది లేదు..

277వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): రాజధానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల పక్షాన న్యాయం ఉందని రైతులు పేర్కొన్నారు. అమరావతినే ఏకైక రాజ ధానిగా ప్రకటించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం శనివారం 277వ రోజుకు చేరుకుంది. పెదపరిమి, తుళ్లూరు, ఐనవోలు, రాయపూడి, అబ్బరాజుపాలె, బోరుపా లెం, వెలగపూడి, మందడం, అనంతవరం తదితర గ్రామా ల్లోని శిబిరాల్లో దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గీతోపదేశంలో శ్రీకృష్ణుడు పేర్కొన్న విధంగా అంతిమ విజయం న్యాయానిదే అన్నారు. రాజధాని అమరావతిపై కక్ష ఎందుకని ప్రశ్నించారు.


మూడు రాజదానులతో ఒరిగేది ఏం లేదని ఐదుకోట్ల మంది చెపుతున్నా అమరావతిపై విషం చిమ్మటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభు త్వం మొండివైఖరి విడనాడాలని కోరారు.  మంగళగిరి మం డలంలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేత పూడి గ్రామాల్లో రైతు సంఘ నేతల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. కార్యక్రమంలో రైతు సంఘ నేతలు ఎ.కిరణ్‌, ఎ.ఉమామహేశ్వరరావు, జూటు దుర్గారావు, యర్రగుంట్ల భా గ్యారావు, వాసా గణేష్‌సాయి, రాణిమేకల రామారావు తది తరులు పాల్గొన్నారు.


పెనుమాక గ్రామంలో జరిగిన నిరసన దీక్షలలో రైతులు, రైతు కూలీలు ఐకాస ప్రతినిధులు పాల్గొ న్నారు. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు మనజాలవని నేతలు వ్యాఖ్యానించారు. పెనుమాకలో జరిగిన దీక్షల లో ఐకాస నేతలు కళ్లం రాజశేఖర్‌రెడ్డి, దండమూరి శ్రీహరి, సుబ్బారావు, సాబ్‌జాన్‌, గుంటక సాంబిరెడ్డి, పలగాని సాంబశివరావు స్థానిక రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-20T14:24:17+05:30 IST