అమరరాజా ఆరు కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-03-31T08:46:22+05:30 IST

రోనా నివారణ చర్యలకు సామాజిక బాధ్యత కలిగిన సంస్థగా అమరరాజా గ్రూప్‌ రూ.6 కోట్ల మొ త్తాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తంలో రూ.5 కోట్లు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు,

అమరరాజా ఆరు కోట్ల విరాళం

చిత్తూరు కలెక్టరేట్‌, రాజమహేంద్రవరం, మార్చి 30: కరోనా నివారణ చర్యలకు సామాజిక బాధ్యత కలిగిన సంస్థగా  అమరరాజా గ్రూప్‌ రూ.6 కోట్ల మొ త్తాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తంలో రూ.5 కోట్లు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు, రూ.కోటిని తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. అమరరాజా సంస్థల అధినేత గల్లా రామచంద్రనాయుడు, ఆయన కుమార్తె డాక్టర్‌ రమాదేవి సోమవారం చిత్తూరులో కలెక్టర్‌ నారాయణ్‌ భరత్‌ గు ప్తాను కలిసి రూ.6 కోట్ల చెక్కును అందించారు. ఈ సందర్భంగా రామచంద్ర నాయుడు మాట్లాడారు. అమరరాజ గ్రూపు వైస్‌ చైర్మన్‌ గల్లా జయదేవ్‌ ఎంపీగా తన నియోజకవర్గమైన గుంటూరులో కోవిడ్‌-19 నివారణ కోసం ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.2.50 కోట్ల మొత్తాన్ని ప్రకటించారన్నారు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో రూ.5 లక్షల విలువైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను అందించామన్నారు. తిరుపతిలో స్థిరపడ్డ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వర్షిణి ఇండస్ర్టీస్‌ ఎండీ శ్రీనివాస్‌ రూ.1.10 కోట్ల విరాళం ఇచ్చారు.


ఓఎన్జీసీ విరాళం రూ.316 కోట్లు

పీఎం కేర్స్‌ ఫండ్‌కి సీఎ్‌సఆర్‌ నిధులు రూ.300 కోట్లు, దేశవ్యాప్తంగా వున్న ఉద్యోగుల రెండు రోజుల జీతం రూ.16 కోట్లు... మొత్తం రూ.316 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్‌ పీఆర్వో ఆక్ర తా భాటియా సోమవారం తెలిపారు.


సంగం డెయిరీ 50 లక్షలు, విట్‌ 25 లక్షలు

సంగం డెయిరీ తరఫున రూ.50 లక్షలు అందించనున్నట్లు డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ తెలిపారు. రాజధాని ఐనవోలు పరిధిలోని వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ అఫ్‌ టెక్నాలజీ(వీఐటీ) రూ.25 లక్షలు అందజేసింది. 200 పడకలున్న వర్సిటీ భవనాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎన్‌.జీ.రంగా వ ర్సిటీ ఉద్యోగులు ఒకరోజు వేతనం(42లక్షలు) విరాళంగా ఇచ్చారు. పీఎం కేర్స్‌కి ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌  రూ.27.5 లక్షల విరాళం అందించారు. సింబియోసిస్‌ టెక్నాలజీ తరఫున నరేశ్‌కుమార్‌ రూ.10 లక్షలు, సాగి కాశీ విశ్వనాథరాజు రూ.10 లక్షలు, పారిశ్రామికవేత్త రఘువర్మ రూ.5 లక్షలు, శ్రావణ్‌ షిప్పింగ్‌ తరఫున సాంబశివరావు రూ.లక్ష అందించారు.

Updated Date - 2020-03-31T08:46:22+05:30 IST