Abn logo
Mar 7 2021 @ 09:38AM

‘వాట్స్‌ నెక్ట్స్‌ ఇండియా 2021’లో అమలాపాల్‌

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో ఒకటైన నెట్‌ఫ్లిక్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘వాట్స్‌ నెక్ట్స్‌ ఇండియా 2021 ప్యానెల్‌ డిస్కషన్‌’ కార్యక్రమంలో ఒక అతిథిగా ప్రముఖ నటి అమలాపాల్‌ పాల్గొంది. ఈ సందర్భంగా అమలాపాల్‌ మాట్లాడుతూ.. బాలీవుడ్‌ సినీ సెలెబ్రిటీలు కరణ్‌ జోహార్‌, ప్రియాంకా చోప్రా, విక్రమాదిత్య మోత్వానీ, వివేక్‌ గొంబర్‌ వంటి హేమాహేమీలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి తనను కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ముఖ్యంగా ఈ ప్యానెల్‌ డిస్కషన్‌లో దక్షిణ భారత చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు అమ‌లాపాల్ తెలిపింది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన ‘పిట్ట కథలు’ చిత్రం ఓటీటీలో విడుదలై ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందిందని, అలాంటి ప్రాజెక్టులో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు అమ‌లాపాల్ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. 

Advertisement
Advertisement
Advertisement