Abn logo
Apr 3 2020 @ 21:38PM

ఆ రూమర్స్ నమ్మవద్దంటున్న అమల అక్కినేని

కేవలం మనిషి నుంచి మనిషికి మాత్రమే కరోనా వ్యాప్తి చెందుతుందని.. జంతువులు, పక్షులు వంటి వాటి వల్ల కరోనా వ్యాప్తి చెందదని డాక్టర్లు చెబుతున్నప్పటికీ కొందరు పెంపుడు జంతువులను సైతం పక్కన పెట్టేస్తున్నారు. ఈ కరోనాకి మనిషే ప్రమాదమని జరుగుతున్న సంఘటనలు చెబుతున్నాయి. అయితే జంతువుల వల్ల కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతుందని కొందరు మూగజీవాలను రోడ్డున వదిలేస్తున్నారు. అలాంటి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది అక్కినేని అమల. బ్లూక్రాస్ ద్వారా ఆమె మూగజీవాలకు ఎంతో సేవ చేస్తుందనే విషయం తెలిసిందే.


తాజాగా ఆమె.. ‘‘సామాజిక దూరం పాటిస్తూనే మీరు మీ పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకోండి. వెటర్నరీ హాస్పటల్స్ ఈ లాక్‌డౌన్‌లోనూ తెరచే ఉంటాయి..’’ అని హాస్పటల్స్ వివరాలను తన ట్వీట్‌లో తెలిపారు అమల అక్కినేని. 


అలాగే మరో ట్వీట్‌లో.. ‘‘దయచేసి జంతువుల నుంచి కోవిడ్ 19 వస్తుందనే రూమర్లను నమ్మవద్దు. ఇప్పటి వరకు పెంపుడు జంతువుల నుంచి మనుషులకు కోవిడ్ 19 వచ్చిందనే కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఎవరైనా అటువంటి వార్తలు చెబితే నమ్మవద్దు..’’ అని తెలిపారు. 




Advertisement
Advertisement
Advertisement