ఏఎం లింగణ్ణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2022-08-11T05:52:12+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుడు ఏఎం లింగణ్ణ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని మాజీ మంత్రి ఎన రఘువీరా రెడ్డి పిలుపునిచ్చారు.

ఏఎం లింగణ్ణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
సేవామందిరం ర్యాలీలో పాల్గొన్న రఘువీరా రెడ్డి

మాజీ మంత్రి రఘువీరారెడ్డి పిలుపు 

 మువ్వన్నెల జెండాలతో భారీ ప్రదర్శన


పరిగి, ఆగస్టు 10: స్వాతంత్య్ర సమరయోధుడు ఏఎం లింగణ్ణ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని మాజీ మంత్రి ఎన రఘువీరా రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని సేవామందిరంలో ఏఎం లింగణ్ణ జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో ఆజాదీకా అమృత మహోత్సవ్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా కొడిగెనహళ్లి ఆంధ్రప్రదేశ గురుకుల ప్రతిభా పాఠశాల, లింగణ్ణ జిల్లాపరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులచే జాతీయ జెం డాలను చేతబట్టుకుని పురవీధుల్లో ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రఘువీరారెడ్డి మాట్లాడారు. ప్రాంతం, భాష సేవానిరతికి అడ్డుగోడలు కావని ఆనాడే చేతుల్లో చూపిన మహ నీయుడు ఏఎం లింగణ్ణ అని కొనియాడారు. ఇక్కడ గొప్ప విద్యాల యాన్ని నెలకొల్పి విద్యార్థుల్లో దేశభక్తిని నింపిన స్ఫూర్తి ప్రదాత ఏఎం లింగణ్ణ అన్నారు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచారన్నారు. 1942లో పెన్నానది తీరాన చక్రవర్తి రాజగోపాలాచారి సేవామందిరం పాఠశాల స్థాపనకు అంకురార్పణ చేశారన్నారు. అప్పటి నుం చి సేవామందిరం వాసికెక్కి విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేలా రూపుదిద్దుకుందన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కేటీ శ్రీధర్‌, తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మీ, ఎస్‌ఐ నరేంద్ర, ఎంపీడీఓ శ్రీలక్ష్మీ, ఏపీఆర్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ మురళిధర్‌బాబు, హెచఎంలు పాల్గొన్నారు. అదేవి ధంగా మండలంలోని ధనాపురం జిల్లాపరిషత ఉన్నత పాఠశాల వి ద్యార్థులచే 200 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఆంగ్ల ఉపాధ్యాయురాలు ఇందిర సొంత నిధులతో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శింపజేసి, దేశ ఔన్నత్యాన్ని గ్రామంలో చాటి చెప్పారు. కార్యక్రమం లో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి రమేష్‌, రైతు సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. 


లేపాక్షి: స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల వి ద్యార్థులు మువ్వన్నెల జెండాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. పాఠశా ల నుంచి లేపాక్షి పురవీధుల్లో ఊరేగారు. దేశభక్తి గీతాలు ఆలపించారు. నంది విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో ప్రి న్సిపాల్‌ ప్రసాద్‌, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 


మడకశిర టౌన: స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాఽధ్యాయులు పట్టణంలో ఆజాదీకా అమృత మహో త్సవ్‌ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అదే సంఖ్య ఆకృతిలో విద్యార్థులు జెండా లు ప్రదర్శించారు. అనంతరం వందేమాతరం నినాదాలతో పట్టణం లో ప్రదర్శన కొనసాగింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జ్యో తిర్మయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


వేడుకలను విజయవంతం చేయాలి

పెనుకొండ: ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా శనివా రం పట్టణంలో నిర్వహిస్తున్న భారీ ప్రదర్శనలో అన్ని పాఠశాలల విద్యార్థులు తరలివచ్చి విజయవంతం చేయాలని డిప్యూటీ డీఈఓ రంగస్వామి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్‌లు, హెచఎంలతో సమావేశమై మాట్లాడారు. భారీ ఎత్తున నిర్వహించే ఈ ర్యాలీలో పాఠశాలలకు చెందిన ఎనఎ్‌సఎ్‌స, ఎనసీసీ విద్యార్థులతో పాటు 75 మంది వివిధ వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణలా నిలిచేలా ఉం డాలన్నారు. ప్రతి విద్యార్థి చేతిలో జాతీయ జెండా ఉండాలన్నారు. పట్టణంలో ఆరోజు ప్రతిఇంటిపై, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలపై జెండాలు ప్రదర్శించాలన్నారు. ర్యాలీ అనంతరం స్థానిక జూనియర్‌ కళాశాలలో బహిరంగ సభ, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నా రు. కార్యక్రమంలో తహసీల్దార్‌ స్వర్ణలత, ఎంపీడీఓ శివశంకరప్ప, ఎంఈఓ గంగప్ప, తదితరులు పాల్గొన్నారు. 


నేటి నుంచి కాంగ్రెస్‌ పాదయాత్ర 

పావగడ: ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నుంచి నాలుగు మండల కేంద్రాల్లో పాదయాత్ర చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెంకటరమణప్ప తెలిపారు. ఈనెల 18 వరకు ప్రతిరోజూ 20 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందన్నారు. తొలిరోజు ఉదయం 8 గంటలకు ఆర్‌ అచ్చంపల్లి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర బళసముద్రం, రాయచెర్లు, తి రుమణి, నాగలమడక, పళవల్లి మీదుగా పావగడకు చేరుకుంటుందన్నారు. 12న దొమ్మితిమర్రి, 13న అర్సిగెరె, 14న శాసలకుంట, 17 న వైఎన హొసకోట, 18న రొప్పం లో యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. అదేరోజు పావగడలో బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి పా దయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-08-11T05:52:12+05:30 IST