ఒలింపిక్స్‌ రేసులో ఉన్నా

ABN , First Publish Date - 2020-11-29T10:06:36+05:30 IST

ర్యాంకుల్లో వెనుకంజలో ఉన్నా తానింకా టోక్యో ఒలింపిక్స్‌ రేసులో ఉన్నానని అంటోంది భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌. టోక్యో విశ్వక్రీడల క్వాలిఫికేషన్‌ ర్యాంకింగ్స్‌లో సైనా ప్రస్తుతం 22వ స్థానంలో ఉంది.

ఒలింపిక్స్‌ రేసులో ఉన్నా

కోల్‌కతా: ర్యాంకుల్లో వెనుకంజలో ఉన్నా తానింకా టోక్యో ఒలింపిక్స్‌ రేసులో ఉన్నానని అంటోంది భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌. టోక్యో విశ్వక్రీడల క్వాలిఫికేషన్‌ ర్యాంకింగ్స్‌లో సైనా ప్రస్తుతం 22వ స్థానంలో ఉంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే టాప్‌-16లోపు ర్యాంకుండాలి. అయితే, త్వరలోనే కీలక టోర్నీల్లో ఆడి టోక్యో బెర్త్‌ దక్కించుకుంటానన్న విశ్వాసముందని 2012 లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా చెప్పింది. ‘ప్రతి ఒక్కరి మదిలో ఒలింపిక్స్‌ ఉందని నాకు తెలుసు. ఒక్కసారి గాడిలో పడ్డానంటే ఫామ్‌లోకొస్తా. టాప్‌-20 షట్లర్లపై విజయాలు సాధించి ర్యాంకును మెరుగుపరచుకుంటా’ అని 30 ఏళ్ల సైనా తెలిపింది.

Updated Date - 2020-11-29T10:06:36+05:30 IST