ఎల్లవేళలా మద్యం అమ్మకాలు

ABN , First Publish Date - 2022-05-25T05:55:35+05:30 IST

ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యం అమ్మకాలు ప్రభుత్వం నిర్ధేశించిన సమయా లలోనే జరుగుతున్నా.. మందుబాబులకు ఏ సమయం లో మద్యం కావాలన్నా అందుబాటులోనే ఉంటుంది.

ఎల్లవేళలా మద్యం అమ్మకాలు
అద్దంకిలోని ఓ బెల్ట్‌షాపులో ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు(ఫైల్‌)

ప్రభుత్వ మద్యం షాపుల  సమీపంలోనే తతంగం

గ్రామాలలో బెల్ట్‌షాపులకు అడ్డుకట్టేలేదు!

అధికారులు దాడులు చేసినా  లెక్కచేయని వైనం

అద్దంకి, మే 24: ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యం అమ్మకాలు ప్రభుత్వం నిర్ధేశించిన సమయా లలోనే జరుగుతున్నా.. మందుబాబులకు ఏ సమయం లో మద్యం కావాలన్నా అందుబాటులోనే ఉంటుంది. కాకపోతే ధర మాత్రమే అధికం. ఎక్కడో మారుమూల గ్రామాలలో బెల్ట్‌షాపులు పెట్టి చాటుమాటుగా రెండు మూడు మద్యం బాటిళ్ళు పెట్టుకొని అమ్మకాలు చేస్తున్నారు అనుకుంటే పొరపాటే.. ప్రభుత్వ మద్యం దుకాణాలకు సమీపంలోనే బెల్ట్‌షాపులు పెట్టి వందల  సంఖ్యలో అవసరమైన అన్ని రకాల బ్రాండ్‌లు అమ్మ కాలు చేస్తున్నారు. ఏకంగా అద్దంకి పట్టణంలోనే పలు ప్రాంతాలలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరు గుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మా త్రమే మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. మిగిలిన సమయాలలో మాత్రం బెల్ట్‌షాపులలో అమ్మకాలు జరుగుతున్నాయి. అర్ధరా త్రి సమయంలో వెళ్ళిన తలుపులు తీసి మరి ఇస్తారు. 


పట్టుబడుతున్నా ఆగని అమ్మకాలు

అద్దంకి పట్టణంలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తూ నాలు గైదు సార్లు పట్టుబడ్డా మరలా యథావిధిగా బెల్ట్‌షాపు లు నిర్వహిస్తున్నారు అంటే అధికారులు నిఘా ఏ మా త్రం ఉందో ఇట్టే అర్ధం అవుతుంది. అద్దంకి పట్టణంలో పెద్ద మొత్తంలో మద్యం నిల్వ పెట్టి అమ్మకాలు చేసే బెల్ట్‌షాపులు పదుల సంఖ్యలో ఉండగా, ఇక పదుల సంఖ్యలో మద్యం బాటిళ్ళు పెట్టుకొని అమ్మకాలు చేసే బడ్డీ బంకులు వందల సంఖ్యలోనే ఉన్నాయి. ఒక్కో ప్రభుత్వ మద్యం దుకాణం సమీపంలో పదుల సంఖ్య లో బెల్ట్‌ షాపులు ఉన్నాయి.  నామ్‌ రోడ్డు, దర్శి రోడ్డు, శింగరకొండ రోడ్డు, మేదరమెట్ల రోడ్డు, రేణింగవరం రోడ్డులలో ఉన్న బడ్డీ దుకాణాలతో పాటు రెస్టారెంట్‌ లలో మద్యం నిత్యం అందుబాటులో ఉంటూనే ఉంది. 


వందల సంఖ్యలో బెల్ట్‌ షాపులు

ఇటీవల అద్దంకి పట్టణంలోని భవానిసెంటర్‌లో ఓ బెల్ట్‌ షాపులో 124 మద్యం బాటిళ్ళు ను పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. సంతమాగులూరు మం డలంలో కూడా పోలీసుల దాడులలో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్ళు పట్టుబడ్డాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల సమీపంలో కూడా రా త్రి సమయంలో బెల్ట్‌ షాపులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇవికాకుండా దాదాపు అన్ని గ్రామాలలో కూడా వందల సంఖ్యలో బెల్ట్‌షాపులు కొనసాగుతునే ఉన్నాయి. ప్రభుత్వ దుకాణాల నుంచి మద్యం కొను గోలు చేసి తీసుకు వచ్చేందుకు ప్రత్యేకంగా కొంత మం ది వ్యక్తులను ఏర్పాటు చేసుకొని తె ప్పించుకుంటున్నా రు. బెల్ట్‌ షాపులు నిర్వహించే వారిలో అత్యధిక శాతం మహిళలు ఉండటం వి శేషం.  పలు సందర్భాలలో బె ల్ట్‌షాపులలో అధికారులు దాడులు చేయగా మహిళలే పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాలలో జరిగే మద్యం అమ్మకాలలో ఎక్కువ భాగం కొనుగోలు చేస్తున్నది కూడా బెల్ట్‌షాపుల నిర్వహకులే ఉంటున్నా రు. ఆయా శాఖల అధికారులు సైతం మొక్కుబడిగానే దాడులు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బెల్ట్ట్‌షాపుల లేకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


Updated Date - 2022-05-25T05:55:35+05:30 IST