చాణక్యనీతి: అలాంటివారు పైభాగం పాలతో నిండిన విషపు కుండలాంటివారు.. జాగ్రత్త తప్పనిసరి!

ABN , First Publish Date - 2022-06-25T12:53:02+05:30 IST

ఆచార్య చాణక్య తన జీవన విధానాలలో...

చాణక్యనీతి: అలాంటివారు పైభాగం పాలతో నిండిన విషపు కుండలాంటివారు.. జాగ్రత్త తప్పనిసరి!

ఆచార్య చాణక్య తన జీవన విధానాలలో ఎన్నో విలువైన విషయాలు రాశారు. ఆయన చెప్పిన ప్రతి విధానం మనిషి తన జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు స్ఫూర్తినిస్తుంది. చాణక్య తెలిపిన విధానాలు నేటికీ చాలామంది పాటిస్తున్నారు. చాణక్యుడు తన విధానంలో ఎవరు స్నేహితుడు?  ఎవరు శత్రువు అనే వివరాలు తెలిపారు. భవిష్యత్‌లో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ విషయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చాణక్య తెలిపారు. 


మనిషి ఎటువంటి వారికి దూరంగా ఉండాలో కూడా చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీ ముందు మధురంగా ​​మాట్లాడేవారికి దూరంగా ఉండండి, వారు మీ వెనుక మిమ్మల్ని నాశనం చేసేందుకు ప్లాన్ చేస్తుండవచ్చు. ఇలాంటి వ్యక్తుల స్వభావం పైభాగం పాలతో నిండిన విషపు కుండ లాంటిది. ఒక వ్యక్తి మీ ముందు ఎంతో మంచిగా ప్రవర్తిస్తుంటే వారితో స్నేహం లేదా సంబంధం కలిగి ఉండకూడదు. ఇలాంటి వారు వారికి అవకాశం వచ్చిన వెంటనే మిమ్మల్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు.అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు.

Updated Date - 2022-06-25T12:53:02+05:30 IST