HYD: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్మీ కాలేజ్‌ అఫ్‌ డెంటల్‌ సైన్స్‌

ABN , First Publish Date - 2021-09-16T17:16:17+05:30 IST

సికింద్రాబాద్‌ మిలటరీ బ్యారక్‌లో 2001లో స్థాపించిన ఆర్మీ కాలేజ్‌ అఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ (ఏసీడీఎస్‌) సెప్టెంబర్‌తో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ

HYD: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్మీ కాలేజ్‌ అఫ్‌ డెంటల్‌ సైన్స్‌

హైదరాబాద్/అల్వాల్‌: సికింద్రాబాద్‌ మిలటరీ బ్యారక్‌లో 2001లో స్థాపించిన ఆర్మీ కాలేజ్‌ అఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ (ఏసీడీఎస్‌) సెప్టెంబర్‌తో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఆఽధ్వర్యంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఏసీడీఎస్‌కు అనుబంధంగా ఉంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్స్‌లో డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందింది. ఈ సంస్థను 2003లో 30 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు.  ప్రిన్స్‌పాల్‌ డాక్టర్‌ ఎస్‌. సుబ్రమాణ్య శర్మ నేతృత్వంలో  దేశంలోని ప్రముఖ కళాశాలల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. బారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌  కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సామాజిక భాధ్యతలో) బాగంగా రూ. 45 లక్షలను అందివ్వడంతో  కోన్‌బీమ్‌ కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ యంత్రాన్ని కళాశాలలో ఏర్పాటు చేశారు. బీడీఎల్‌ సీఎండీ కమెడోర్‌ సిద్దార్థ్‌ మిశ్రా, మేజర్‌ జనరల్‌ ఆర్‌కే. సింగ్‌ సమక్షంలో ఆ యంత్రాన్ని ప్రారంభించారు. 

Updated Date - 2021-09-16T17:16:17+05:30 IST