Advertisement
Advertisement
Abn logo
Advertisement

పూర్వ విద్యార్థి దాతృత్వం

ఫర్నీచర్‌ కొనుగోలుకు రూ. 50 వేల విరాళం

నంబులపూలకుంట, డిసెంబరు 4: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు ప్రవాసాంధ్రుడు అచ్చిరెడ్డిగారి నాగి రెడ్డి రూ. 50 వేలు విరాళంగా అందజేసినట్లు హెచ్‌ఎం తిరుపా ల్‌నాయక్‌ పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన నాగిరెడ్డి ఈ పాఠశాలలోనే చదువుకుని, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. గ్రామంలో తాను చదువుకు న్న పాఠశాలలో ఫర్నీచర్‌ కోసం రూ. 50 వేలు వితరణ చేశారు. వారి కుటుంబీకులు అయిన టీచరు అచ్చిరెడ్డిగారి జ్యోతి చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులకు శనివారం అందజేశారు. ఈ పాఠశాలలో పదోతరగతిలో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు నగదు బహుమతులను ఆయన చెల్లిస్తున్నారని ఉపాధ్యా యులు, ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపా ధ్యాయులు రామాం జులయాదవ్‌, మురళి, వెంకటరమణనాయక్‌, వెంకటరామిరెడ్డి, రహీం, షఫీ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement