రెడ్‌జోన్‌గా ప్రకటించినా...?

ABN , First Publish Date - 2020-04-09T09:55:27+05:30 IST

పులివెందులను రెడ్‌జోన్‌గా ప్రకటించినా ప్రజలు యథేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్నారు. బుధవారం పూలంగళ్ల

రెడ్‌జోన్‌గా ప్రకటించినా...?

పులివెందుల, ఏప్రిల్‌ 8: పులివెందులను రెడ్‌జోన్‌గా ప్రకటించినా ప్రజలు యథేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్నారు. బుధవారం పూలంగళ్ల ప్రధా న వీధులు మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రజ లు గుంపులు గుంపులుగా కనిపించారు.  వైరస్‌ మహమ్మారి ప్రబలితే బాధితుని కుటుం బ సభ్యులు, వారి చుట్టుపక్కల వారు మహమ్మారి బారిన పడాల్సిందే.   


రిమ్స్‌కు ఎనిమిది మంది తరలింపు

 పులివెందులలో ఎనిమిది మంది విద్యార్థులను కడప రిమ్స్‌కు తరలించారు. పులివెందులలో 2వ పాజిటివ్‌ కేసు నమోదైన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఇరువురికి కరోనా పాజిటివ్‌ వచ్చిం ది. వారిలో ఆ వ్యక్తి 13ఏళ్ల కుమార్తె కూడా ఉం ది. ఆ వ్యక్తి ఢిల్లీ మత సభలకు వెళ్లి గతనెల 15న పులివెందులకు వచ్చారు. 15 నుంచి 18వ తేదీ వరకు అతని కుమార్తె పట్టణంలో ఓ పాఠశాలకు వెళ్లింది. ఆ సందర్భంలో ఆ విద్యార్థిని ఎవరెవరితో కలిసి భోజనం చేసింది, కలిసి కూ ర్చుంది అని అధికారులు రెండు రోజులుగా ఆరా తీసి బుధవారం ఎనిమిది మందిని గుర్తిం చి వారిని కడపకు తరలించారు.  

Updated Date - 2020-04-09T09:55:27+05:30 IST