యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు

ABN , First Publish Date - 2021-11-28T05:25:05+05:30 IST

యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు

యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 39ధాన్యంకొనుగోలు కేంద్రాలున్నాయని, సుమారు 1.7లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామన్నారు.  రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లు మహేష్‌ భగవత్‌, స్టీఫెన్‌ రవీంద్ర, ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ ప్రీత్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, సివిల్‌ సప్లయీస్‌ అధికారులు శ్యామరాణి, మనోహర్‌ రాథోడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:25:05+05:30 IST