Abn logo
Sep 25 2021 @ 00:56AM

వరికి ప్రత్యామ్నాయ పంటలను ఎన్నుకోవాలి

గుండాలలో మాట్లాడుతున్న వ్యసాయ అధికారి సంతోషి

మోత్కూరు, గుండాల, వలిగొండ, యాదాద్రి రూరల్‌, తుర్కపల్లి, సంస్థాన్‌నారాయణపురం, సెప్టెంబరు 24: వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మోత్కూరు, గుండాల మండలాల ఏవోలు  కె.స్వప్న, సంతోషి సూచించారు.  మోత్కూరు మండలం పాటిమట్ల, గుండాల మండలం బ్రాహ్మణపల్లిలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేనందున రైతులు యాసంగిలో వరిసాగు చేయకుండా మార్కె ట్‌లో డిమాండ్‌ ఉన్న వేరుశనగ, మినుము, పెసర, కుసుమ, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్ర మాల్లో ఏఈవో ఎం.అశోక్‌, కొండ సోంమల్లు, డి.వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ డి.మల్లేశం సంధ్య, పాండరి, ఎంపీటీసీ  కవిత, ఏఈవో నిషిత పాల్గొన్నారు. అదేవిధంగా వలిగొండ మండలం గోకారంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ నూతి రమేష్‌రాజు మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మాధవి, నర్సింహ, ఏఈవో నవిత, పాల్గొన్నారు. అడ్డగూడూరు మండలం చౌళ్లరామారంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, ఏఈవో శ్వేత,  పోగుల నర్సిరెడ్డి, తోట కృష్ణారెడ్డి, మందుల కిరణ్‌, సోమన్న శీలం ఉప్పలయ్య, లింగమల్లు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో రైతు వేధిక, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చీర శ్రీశైలం మాట్లాడుతూ రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో జిన్న మాధవరెడ్డి, ఏవో రాజేష్‌కుమార్‌ పాల్గొన్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో సర్పంచ్‌ పాపయ్య, ఎంపీటీసీ దోటి జంగయ్య, జక్కర్తి కృష్ణ, ఏఈవో లక్ష్మణ్‌ పాల్గొన్నారు. తుర్కపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌ పోగుల ఆంజేయులు, ఏవో దుర్గేశ్వరి, ఎంపీటీసీ నవీన్‌కుమార్‌, ఏఈవో ఉమారాణి మాట్లాడారు.