Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

వికారాబాద్‌: మార్కెట్‌లో ఎదురవుతున్న సమస్యలు, క్షేత్ర స్థాయిలో వనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో భాగంగా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని వికారాబాద్‌ కలెక్టర్‌ నిఖిల తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన ‘యాసంగి లో వరికి బదులుగా ఇతర పంట సాగు’ అనే పోస్టర్‌, బుక్‌లెట్లను కలెక్టర్‌ ఆ విష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వానాకాలం, యాసంగిలో వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగిందని, వడ్ల కొనుగోలుకు మార్కెట్‌ ఇబ్బందులు తలెత్తడంతో రైతులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. వేసిన పంటనే మళ్లీ వే స్తే పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుందన్నారు. పప్పు దినుసులు, నూనెగింజలు, కూరగాయల అవసరానికి, ఉత్పత్తికి మధ్య వ్యత్యాసం ఉందని, అం దువల్ల రైతులు వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, పెసర, ఆముదం, మినుములు, పొద్దు తిరుగుడు, జొన్న పంటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement