ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

ABN , First Publish Date - 2021-12-01T05:03:53+05:30 IST

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు.

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
సింధనూర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి

- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి

- పలు గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు

అయిజ/ కేటీదొడ్డి/ గద్వాలరూరల్‌/ గట్టు/ అలంపూర్‌/ అలంపూర్‌ చౌరస్తా/ వడ్డేపల్లి/ రాజోలి, నవంబరు 30 : యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు. మండల పరిధిలోని సింధనూరులో ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులు, వ్యవసాయాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌లో పండిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యాసంగి ధాన్యాన్ని కొనబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో, ప్ర త్యామ్నయ పంటలు సాగు చేయాలని తెలియ జెప్పడం కోసమే సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. సింగిల్‌విండో అధ్యక్షుడు పోతుల మధుసూద న్‌రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం 72 వేల క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ఖరీఫ్‌లో రైతులు 12 వేల ఎకరాల్లో వరి సాగు చేశారని మూడు లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ నాగేశ్వర్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి శంకర్‌లాల్‌, విస్తరణ అధికారి విజయ్‌, రవిరెడ్డి, ఎక్లాస్‌పూర్‌ ఆంజనేయులు, సింగిల్‌విండో డైరెక్టర్‌ ఉశేని, బ్రహ్మయ్య, రాముడు పాల్గొన్నారు.


- ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌నాయక్‌ అన్నారు. మండలంలోని పాతపాలెం, మైలగడ్డ గ్రామాల్లోని రైతు వేదికలలో మంగళవారం నిర్వహించిన అవగా హన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి కరుణశ్రీ, ఏఈవోలు లావణ్య, ప్రియాంక, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులు పాల్గొన్నారు.   


- గద్వాల మండలంలోని చెనుగోనిపల్లి, సంగాల, బీరోలు గ్రామాల్లోని రైతు వేదికలలో మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. చెనుగోనిపల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహనా సదస్సులో ఏవో సుచరిత మాట్లాడారు. ఎకరం వరి పండించేందుకు అవసరమైన నీటితో నాలుగు ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయొచ్చని సూచించారు.   కార్య క్ర మంలో ఏఈవో ఉషశ్రీ, సర్పంచు అనంతమ్మ, ఎంపీ టీసీ సభ్యురాలు సరోజమ్మ, కుర్మన్న పాల్గొన్నారు. 


- గట్టు మండలంలోని బల్గెర గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో జడ్పీటీసీ సభ్యురాలు మాట్లాడారు. యాసంగిలో తెలంగాణ ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేయాలన్నారు. సదస్సులో సర్పంచ్‌ హనుమంతునాయుడు, వ్యవసాయ అధికారి దివ్య, ఎంపీటీసీ సభ్యురాలు రూపవతి, ఉపసర్పంచ్‌ మొగిలి హనుమంతు, సామెల్‌, పంచాయతీ కార్యదర్శి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


- అలంపూరు మండలంలోని ర్యాలంపాడు   రైతు వేదిక భవనంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ చక్రినాయక్‌, ర్యాలంపాడు, సుల్తానాపురం, జిల్లెలపాడు గ్రామ సర్పంచులు, మండల వ్యవసాయాధికారి అనిత, ఏఈవో తేజశ్విని పాల్గొన్నారు. 


- ఉండవల్లి మండలంలోని మెన్నిపాడు గ్రామంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో వ్యవసాయ అధికారి సురేఖ మాట్లాడారు. వరికి బదులు పప్పులు, నూనె గింజలు, తృణధాన్యాలు తది తరాలను సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల స్పెషల్‌ ఆఫీసర్‌ భీమేశ్వర్‌ , ఏఈఓ పరమేష్‌ గౌడు, సర్పంచు బజారన్న పాల్గొన్నారు. 


- వడ్డేపల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సులో మండల వ్యవసాయాధికారి రాధ మాట్లాడారు. యా సంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


- రాజోలిలోని రైతు వేదిక భవనంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా వ్యవసా య సహకార సంఘం అధికారి ప్రసాద్‌రావు మాట్లా డారు. యాసంగి సీజన్‌లో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, గంగిరెడ్డి, సీతారామ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T05:03:53+05:30 IST