అవి లేకున్నా... ఇవి చాలు!

ABN , First Publish Date - 2020-04-27T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల నిత్యావసర వస్తువుల సరఫరా తగ్గింది. సూపర్‌ మార్కెట్‌లో కొన్ని రకాల వంట సామానులు ఇదివరకటిలా ర్యాకుల్లో బారులు తీరి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరమైన దినుసులు దొరక్కపోతే కొన్ని రోజులపాటు...

అవి లేకున్నా... ఇవి చాలు!

లాక్‌డౌన్‌ వల్ల నిత్యావసర వస్తువుల సరఫరా తగ్గింది. సూపర్‌ మార్కెట్‌లో కొన్ని రకాల వంట సామానులు ఇదివరకటిలా ర్యాకుల్లో బారులు తీరి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరమైన దినుసులు దొరక్కపోతే కొన్ని రోజులపాటు వాటికి బదులు అదే రుచిని ఇచ్చే అందుబాటులో ఉన్న వాటిని వాడుకుంటే సరి!


నూడుల్స్‌కు ప్రత్యామ్నాయం వెజిటబుల్‌ స్ట్రిప్స్‌

ఇంట్లో ఐదు నిమిషాల్లో చేసుకొని తినే నూడుల్స్‌ చాలామందికి అలవాటు. షాపుల్లో నూడుల్స్‌ ప్యాకెట్లు దొరకలేదు. లేదంటే ఇంట్లో నూడుల్స్‌ అయిపోయాయి. అలాంటప్పుడు నూడుల్స్‌ ప్రియలు దిగులుపడకుండా దోస, బీట్‌రూట్‌, క్యారట్‌ లాంటి కూరగాయలను సన్నటి చక్రాల్లా తరిగి వాటితో ఎగ్‌, పాస్తా నూడుల్స్‌ చేసుకుంటే సరి! ఇది ఆరోగ్యకరం కూడా.


బియ్యానికి బదులు గోబీ మాష్‌, దాలియా, కినోవా

అన్నం లేకుండా ఏం తిన్నా మంచి భోజనం చేసిన సంతృప్తి అయితే కలగదు. బియ్యం కొరత ఏర్పడితే వాటి స్థానంలో తాత్కాలికంగా కినోవా, దాలియా, క్యాలీఫ్లవర్‌ మ్యాష్‌లను వాడొచ్చు. ఇవి సత్తువనివ్వడంతో పాటు ఆరోగ్యానికి మంచివి.


అవకాడో లోటు తీర్చే దోస, వంకాయ

ఇటీవల కాలంలో సూపర్‌ ఫుడ్‌గా అవకాడోలు బాగా ఫేమస్‌ అయ్యాయి. లాక్‌డౌన్‌తో మార్కెట్లో వీటి సరఫరా తగ్గి కొరత ఏర్పడింది. ఇవి దొరక్కపోతే బదులుగా దోస, వంకాయలను ట్రై చేస్తే అవకాడో లేని లోటును పూరిస్తాయి. 


చింతపండు చింత తీర్చే టొమాటో!

వంటింట్లో చింతపండు స్థానం ప్రత్యేకం. ఇంట్లో చింతపండు లేదనుకోండి. చింతపండుకు బదులు టొమాటోలను చక్కని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. 


తులసి స్థానంలో కొత్తిమీర

ఇప్పుడు పలు రకాల సాస్‌ల తయారీలో రుచి కోసం తులసిని వాడుతున్నారు. అయితే ఈ సమయంలో తులసి ఆకులు దొరకడం కష్టమే. అలాంటి రుచిని ఇచ్చే కొత్తిమీర ఆకులు మార్కెట్లో విరివిగా దొరుకు తున్నాయి కాబట్టి కొన్ని రోజుల పాటు వాడుకుంటే సరిపోతుంది.


Updated Date - 2020-04-27T05:30:00+05:30 IST