ఉప్పుకు ప్రత్యామ్నాయం!

ABN , First Publish Date - 2021-03-09T18:30:46+05:30 IST

జీవక్రియలు సజావుగా సాగడానికి ఉప్పు అవసరమే! అయితే దీని వాడకం పరిమితంగా ఉండాలి. లేదంటే అధిక రక్తపోటు లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉప్పు వాడకాన్ని తగ్గించడంలో ఉపయోగపడే ప్రత్యామ్నాయాలున్నాయి

ఉప్పుకు ప్రత్యామ్నాయం!

ఆంధ్రజ్యోతి(09-03-2021)

జీవక్రియలు సజావుగా సాగడానికి ఉప్పు అవసరమే! అయితే దీని వాడకం పరిమితంగా ఉండాలి. లేదంటే అధిక రక్తపోటు లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉప్పు వాడకాన్ని తగ్గించడంలో ఉపయోగపడే ప్రత్యామ్నాయాలున్నాయి.


అయొడైజ్‌డ్‌ సాల్ట్‌: ప్రతి ఇంట్లో టేబుల్‌ సాల్ట్‌ పేరుతో వాడే ఉప్పు ఇదే! థైరాయిడ్‌ సమస్యలు తలెత్తకుండా ఈ రకం ఉప్పు తోడ్పడినా, దీన్ని పరిమితంగానే వాడాలి. పిల్లల మెదడు ఆరోగ్యకరంగా పెరగడానికి అయొడిన్‌ ఎంతో తోడ్పడుతుంది. అయితే 18 ఏళ్ల వయసు మొదలు రోజు మొత్తంలో తినే ఆహారం ద్వారా, టేబుల్‌ సాల్ట్‌ 150 మైక్రోగ్రాములకు మించకుండా చూసుకోవాలి.


కోషర్‌ సాల్ట్‌: పొడవాటి పలుకుల రూపంలో ఉండే ఈ రకం ఉప్పులో అదనంగా అయొడిన్‌ను జోడించరు. గుండెజబ్బులు, అధిక రక్తపోట్లకు కారణమయ్యే సోడియం వాడకం తగ్గించాలనుకుంటే టేబుల్‌ సాల్ట్‌కు బదులుగా కోషర్‌ సాల్ట్‌ను ఎంచుకోవాలి. అయితే కోషర్‌ సాల్ట్‌ను రోజు మొత్తంలో 2,300 మిల్లీగ్రాములకు మించి తీసుకోవద్దు.


సీ సాల్ట్‌: మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌, జింక్‌, అయొడిన్‌ వంటి వేర్వేరు ఖనిజ లవణాలన్నీ కలిగి ఉండే సముద్రపు ఉప్పు ఆరోగ్యకరమైనది. రోజు మొత్తంలో ఈ ఉప్పు పరిమాణం ఒక టీస్పూను దాటకూడదు.


లో సోడియం సాల్ట్‌: సోడియం వల్ల అధిక రక్తపోటుకు గురయ్యేవాళ్లు ఈ ఉప్పును ఎంచుకోవచ్చు. దీనిలో 70% పొటాషియం, 30% సోడియం ఉంటుంది.


పింక్‌ సాల్ట్‌: హిమాలయన్‌ రాక్‌ సాల్ట్‌ ఇది. దీనిలోని అధిక ఖనిజలవణాలు కండరాల నొప్పులను తగ్గిస్తాయి. ఈ ఉప్పు వాడితే పిహెచ్‌ బ్యాలెన్స్‌ సమంగా ఉండి, రక్తప్రసరణ మెరుగు పడుతుంది.

Updated Date - 2021-03-09T18:30:46+05:30 IST