బాదుడే..!

ABN , First Publish Date - 2022-04-07T05:40:39+05:30 IST

వైసీపీది పన్నుల పాలన అయింది.

బాదుడే..!
రిజిసే్ట్రషన్లు ఆగిపోవడంతో ఖాళీగా ఉన్న కార్యాలయం

  1. జిల్లా కేంద్రంలో పెరిగిన రిజిసే్ట్రషన చార్జీలు 
  2. భూముల విలువ 25 శాతం పెంపు
  3. సామాన్యులపై అధిక భారం


నంద్యాల, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): వైసీపీది పన్నుల పాలన అయింది. ప్రతి రెండు నెలలకు ఓసారి ఏదో ఓ పన్ను పెంచుతూనే ఉన్నారు. ప్రజలకు వాతలు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకసారి చెత్త పన్ను వేశారు. మరోసారి విద్యుత చార్జీల భారం వేశారు. తాజాగా రిజిసే్ట్రషన చార్జీలు పెంచారు. నంద్యాల జిల్లాగా ఏర్పాటయిందన్న ఆనందం పట్టణ వాసులకు నాలుగు రోజులైనా మిగిలేలా లేదు. రెండ్రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం నంద్యాల అర్బన, రూరల్‌ భూమి విలువలను 15 నుంచి 25 శాతం వరకు పెంచి రిజిసే్ట్రషన చార్జీల భారాన్ని ప్రజలపై మోపింది. ఈ పెంపు బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా పెరిగిన రిజిసే్ట్రషన చార్జీలను రాష్ట్రవ్యాప్తంగా రూపొందిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లలో ఎక్కించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో బుధవారం నంద్యాలలో రిజిసే్ట్రషన్లు ఆగిపోయాయి. పెరిగిన చార్జీల ప్రభావం జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న భూముల క్రయ విక్రయాలపై పడే అవకాశం ఉందని స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు.


పెరుగుదల ఇలా..

రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువను వాణిజ్య, గృహ సముదాయాలు, పరిశ్రమల ప్రాంతాలను పరిగణలోనికి తీసుకుంటూ విభజించారు. అయితే జిల్లా కేంద్రంలో మాత్రం ఎక్కువగా వాణిజ్య, గృహ సముదాయాల ప్రాంతాల ఆధారంగానే విలువను నిర్ణయించారు. పరిశ్రమల ప్రాంతం కూడా కొంత వాణిజ్య ప్రాంతంలోనికి, కొంత గృహ సముదాయాల పరిధిలోకి రావడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని షరాఫ్‌ బజార్‌, కల్పనా సెంటర్‌, మున్సిపల్‌ కాంప్లెక్సు, గాంఽధీచౌక్‌, ఆర్టీసీ-సంజీవ్‌నగర్‌ గేట్‌ లైను వంటివన్నీ వాణిజ్య ప్రాంతాల కిందకు వస్తాయి. వీటితో పాటు ఇండసి్ట్రయల్‌ ప్రాంతాలైన డీ ఫ్యాక్టరీ, ఎస్పీవై రెడ్డి ప్యాక్టరీ వంటివి కూడా వాణిజ్య ప్రాంతాల కిందికి వస్తాయి. ఇక్కడ ఒక గజం ధర గతంలో రూ.21 వెయ్యి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని రూ.25 వేలు చేసింది. ఇక గృహ సముదాయ ప్రాంతాల కిందికి బైరాముల్‌ సీ్ట్రట్‌, చాంద్‌బడా, బొమ్మలసత్రం గుర్రాలపేట, జామియా మసీదు, మార్కెట్‌ యార్డు, నడిగడ్డ వంటివి వస్తాయి. వీటి విలువను గజానికి రూ.600 నుంచి రూ.1,500 వరకు పెంచారు. వీటితో పాటు నంద్యాల, మహానంది మండలాల్లోని బుక్కాపురం, తిమ్మాపురం, బస్వాపురం, రాయమల్‌పురం, మునగాల, పులిమద్ది, భీమవరం వంటి గ్రామాల్లో కూడా భూమి విలువ పెరిగింది. ఒక్క తిమ్మాపురంలో గజం విలువ రూ.850 నుంచి రూ.1,000కి పెరిగింది. మిగతా గ్రామాల్లో రూ.650 నుంచి రూ.850కు పెరిగింది.


ఆగస్టు నుంచి జిల్లా వ్యాప్తంగా..

కొత్తగా జిల్లల కేంద్రం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయని, అభివృద్ధి జరగుతుందనే సాకుతో భూముల ధరలు పెంచేస్తారు. వాటి మార్కెట్‌ విలువ అమాంతం పెరిగిపోతుంది. ప్రభుత్వ ధరలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం ఏమీ ఉండదు. అసలే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఖజానాను నింపడానికి ప్రభుత్వానికి కొత్త జిల్లాలు అవకాశం ఇస్తున్నాయి. ఆలోచన వచ్చిందే తడవుగా భూముల విలువ పెంచి రిజిసే్ట్రషన చార్జీలను పెంచేసింది. ఈ విలవ పెంపు కూడా జిల్లా అంతటా ఒకేసారి కాకుండా విడతల వారీగా చేయనుంది. మొదట జిల్లా కేంద్రంలో, శివారు ప్రాంతాల్లో భూముల విలువ పెంచింది. ఆ తర్వాత జిల్లా అంతటా పెంచే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆగస్టు నుంచి జిల్లా వ్యాప్తంగా పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం. ఇలా దఫదఫాలుగా రిజిసే్ట్రషన చార్జీలను పెంచితే ప్రజలు గుర్తించరని, వ్యతిరేకత అంతగా ఉండదని ప్రభుత్వం యోచన అనే అభిప్రాయం వినిపిస్తోంది. 


సగటు మనిషికి ఇబ్బంది..

పేద, మధ్య తరగతి వాళ్లు కూడా పైసా పైసా కూడ బెట్టి ఉన్నంతలో చిన్న ఇల్లు కట్టుకుందామని ఆశపడతారు. ప్రభుత్వం ఇలా ఇషానుసారం భూముల విలువలు, రిజిసే్ట్రషన విలువలు పెంచుకుంటూ పోతే పేద మధ్యతరగతికి సొంతింటి కలలు కల్లలైపోతాయి. బాలాజీ కాంప్లెక్సు ప్రాంతంలో గతంలో రూ.8,500 ఉన్న గజం భూమి ధర ప్రస్తుతం రూ.10 వేలయింది. ఈ లెక్కన వంద గజాల ప్లాటుకు రూ.15,000 వేలు అదనంగా పెరిగింది. దీనికి అనుగుణంగా రిజిసే్ట్రషన చార్జీలు చెల్లించాలి. ఇక రూరల్‌ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనే రైతులకు కూడా పెరిగిన చార్జీల అదనపు భారం పడుతుంది. 


ఇపుడిప్పుడే..

కొవిడ్‌ వల్ల రెండేళ్లుగా నంద్యాల ప్రాంతంలో రిజిసే్ట్రషన్లు మందకొడిగా ఉన్నాయి. ఇపుడిపుడే ఊపందుకున్నాయి. ఈ సమయంలో కొత్త జిల్లాల పేరిట రిజిసే్ట్రషన చార్జీలను పెంచడం వల్ల మళ్లీ స్థిరాస్తి వ్యాపారం దెబ్బతింటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రిజిసే్ట్రషన శాఖకు కూడా ఆదాయం తగ్గే అవకాశం ఉంది. 


  ప్రాంతాల వారీగా పెరిగిన రిజిసే్ట్రషన చార్జీల ప్రకారం అదనపు భారం

 ప్రాంతం గతంలో ప్రస్తుతం 5 సెంట్లకు గతంలో అయ్యే ఖర్చు ప్రస్తుత ఖర్చు అదనపు భారం

 షరాఫ్‌ బజార్‌ రూ.21,000 రూ.25,000 రూ.37,000 రూ.45,000 రూ.8000

 బైర్మల్‌ వీధి రూ.8,500 రూ.10,000 రూ.15,300 రూ.18,000 రూ.3000

 గుర్రాలపేట రూ.7,500 రూ.9,000 రూ.13,500 రూ.16,000 రూ.2,500

 చాకలిపేట రూ.5,200 రూ.6,200 రూ.9,360 రూ.11,160 రూ.1,800

 నడిగడ్డ రూ.4,000 రూ.4,800 రూ.7,200 రూ.8,640 రూ.1,450

 రూరల్‌ (ఎకరా) రూ.31.20 లక్షలు రూ.40.80 లక్షలు రూ.23,400 రూ.30,600 రూ.7,200


 సంవత్సరాల వారీగా నంద్యాలలో రిజిసే్ట్రషన వసూళ్లు 

  సంవత్సరం లక్ష్యం వసూళ్లు

 2019-20 రూ.50.99 కోట్లు రూ.41.67 కోట్లు

 2020-21 రూ.47.67 కోట్లు రూ.39.99 కోట్లు

 2021-22 రూ.63.59 కోట్లు రూ.46.46 కోట్లు


   ఇబ్బందికరమే! 

కొత్త జిల్లా ఏర్పడిందని సంతోషపడ్డాం. కానీ రెండ్రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రిజిసే్ట్రషన్ల ధరలను పెంచేసింది. దీని వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. ఇది సరైన నిర్ణయం కాదు. జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదు. 

-విజయానంద్‌, వ్యాపారి, నంద్యాల. 

ఫ భూములు కొనగలమా

రిజిసే్ట్రషన ధరలు పెంచితే మార్కెట్లో భూముల విలువ అమాంతంగా పెరుగుతుంది. సగటు మనుషులం ఇంటి స్థలం కూడా కొనలేం. సంక్షేమం పేరుతో డబ్బులు పంచుతూ మరోపక్క పన్నుల రూపంలో వసూలు చేయడం సరికాదు. రిజిసే్ట్రషన్ల ధరల పెంపు ప్రభుత్వానికి, దళారులకు జేబులు నింపేలా ఉంది. 

- లక్ష్మణ్‌, నంద్యాల 

Updated Date - 2022-04-07T05:40:39+05:30 IST