Abn logo
May 14 2021 @ 10:24AM

జైలులో కరోనా రోగులకు చికిత్స చేసేందుకు అనుమతించండి...

కోర్టును అభ్యర్థించిన అల్‌ఖైదా డాక్టర్ 

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కష్టకాలంలో జైలులో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు తనకు అనుమతించాలని అల్‌ఖైదా సభ్యుడు, ఉగ్రవాది, డాక్టర్ సబీల్ అహ్మద్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.తీహార్ జైలులో ఖైదీలకు కరోనా సోకిన నేపథ్యంలో వైద్యుడిగా తనకు ఏడేళ్ల అనుభవం ఉన్నందున తనకు చికిత్స చేసేందుకు అనుమతించాలని ఢిల్లీ స్పెషల్ జడ్జి ధర్మేందర్ రాణా ముందు  సబీల్ అహ్మద్ కోరారు.అల్ ఖైదా సభ్యుడు అహ్మద్ ను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ ఫిబ్రవరి 22వతేదీన అరెస్టు చేసింది. తాను ఎంబీబీఎస్ చదివానని, తనకు క్లిష్టమైన కేసుల చికిత్సలో ఏడు సంవత్సరాల అనుభవం ఉందని అహ్మద్ పేర్కొన్నారు. 


Advertisement