కావలసినవి: శనగపిండి - ఒక కప్పు, బాదం పలుకులు - ఒక కప్పు, పంచదార - రెండు కప్పులు, నూనె - రెండు కప్పులు, నెయ్యి - రెండు కప్పులు.
తయారీ విధానం: ముందుగా బాదం పలుకులను అరగంట పాటు వేడి నీళ్లలో నానబెట్టి పొట్టు తీసుకోవాలి. తరువాత పాలతో కలిపి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె ఒక కప్పు, నెయ్యి ఒక కప్పు వేసి కాస్త వేడి అయ్యాక శనగపిండి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్‌లో నీళ్లు పోసి పంచదార వేసి పాకం తయారుచేసుకోవాలి. పాకం తీగ సాగేలా అయ్యాక బాదం పలుకుల పేస్టు వేసి కలుపుకోవాలి. తరువాత వేయించిన శనగపిండి వేయాలి. మిశ్రమం ఉడుకుతున్న సమయంలో మిగిలిన నెయ్యి, నూనె కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. తరువాత వెడల్పాటి ప్లేట్ తీసుకుని నూనె రాయాలి. అందులో బాదం మైసూర్ పాక్ మిశ్రమం పోయాలి. ప్లేట్ అంతటా సమంగా పడేలా చూసుకోవాలి. చల్లారిన తరువాత కట్ చేసుకుంటే బాదం మైసూర్ పాక్ రెడీ.