బాదం ఫిర్ని

ABN , First Publish Date - 2021-03-27T18:27:16+05:30 IST

పాలు - ఒక లీటరు, బియ్యం - అరకప్పు, కుంకుమపువ్వు - చిటికెడు, జీడిపప్పు - పది పలుకులు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, రోజ్‌ వాటర్‌ - అర టేబుల్‌స్పూన్‌.

బాదం ఫిర్ని

కావలసినవి:  పాలు - ఒక లీటరు, బియ్యం - అరకప్పు, కుంకుమపువ్వు - చిటికెడు, జీడిపప్పు - పది పలుకులు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, రోజ్‌ వాటర్‌ - అర టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం: బియ్యంను శుభ్రంగా కడిగి గంటన్నర పాటు నానబెట్టాలి. ఒక పాత్రలో పాలు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యంలో నీళ్లు తీసేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు పాలను మళ్లీ వేడి చేయాలి. మెత్తగా గ్రైండ్‌ చేసిన బియ్యం పేస్టును వేసి ఉండలు లేకుండా కలపాలి. తరువాత పంచదార వేసి కలియబెట్టాలి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌ వేయాలి. మిశ్రమం చిక్కగా అవుతున్న సమయంలో స్టవ్‌పై నుంచి దింపి చిన్నచిన్న కప్పుల్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. జీడిపప్పు, కుంకుమ పువ్వుతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-03-27T18:27:16+05:30 IST