ఆలమట్టికి 72,031 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2020-07-11T08:37:25+05:30 IST

కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. శుక్రవారం 72,031 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ఇరిగేషన్‌ ..

ఆలమట్టికి 72,031   క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద నీరు


గద్వాల/నాగర్‌కర్నూల్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. శుక్రవారం 72,031 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఇప్పటి వరకు ప్రాజెక్టుకు 63.37 టీఎంసీల నీరు వరద రూపంలో చేరగా, ప్రస్తుతం 87.62 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జల విద్యుత్తుకు 15 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నాయరాణపూర్‌ ప్రాజెక్టుకు 16,591 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 37.37 టీఎంసీలకు గాను 27.73 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాలకు వర్షాల ద్వారా మూడు వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది.


ప్రస్తుతం నెట్టెంపాడు, భీమా పథకాలకు 1,489 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా, ప్రాజెక్టు 9.66 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.87 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలంపూర్‌, కర్నూల్‌ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హంద్రీనీవా, తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3,102 క్యూసెక్కుల వరద చేరుతోంది. సుంకేసుల, హంద్రీ నుంచి 14,664 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. సుంకేసుల నుంచి 8,824, హంద్రీ నుంచి 5,640 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో 813.6 అడుగుల స్థాయి నుంచి నీటి మట్టం 814.10 అడుగులకు చేరింది.

Updated Date - 2020-07-11T08:37:25+05:30 IST