వీరుడికి వందనం

ABN , First Publish Date - 2022-07-05T06:09:31+05:30 IST

అల్లూరి సీతారామరాజు నినాదం మార్మోగింది. 125వ జయంత్యుత్సవాల్లో ‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..! ’ అంటూ దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అల్లూరి స్ఫూర్తిని కొని యాడారు.

వీరుడికి వందనం

అల్లూరిని కీర్తించిన ప్రధాని మోదీ

 నినదించిన యువత.. పులకించిన తెలుగు నేల

 మన్నెం వీరుడి 125వ జయంత్యుత్సవం.. 

  పెద అమిరం.. జనసంద్రం 

దేశభక్తిని తట్టిలేపిన సాంస్క ృతిక కార్యక్రమాలు


భీమవరం, జూలై 4(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు నినాదం మార్మోగింది. 125వ జయంత్యుత్సవాల్లో ‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..! ’ అంటూ దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అల్లూరి స్ఫూర్తిని కొని యాడారు. మన్యం పోరాట యోధుని గాథలను నెమరు వేసుకున్నారు. భీమవరం వేదికగా సోమవారం నిర్వహించిన జయంతి వేడుకలు జాతీయ స్ఫూర్తిని రగిలించాయి. పెద అమిరంలో నిర్వహిం చిన బహిరంగ సభకు దేశ ప్రధాని మోదీ ముఖ్య అతిఽథిగా విచ్చేశారు. విప్లవ వీరునికి నీరాజనాలు పలికారు. రాష్ట్రం నలుమూలల నుంచి అల్లూరి జయంతి వేడుకలకు వేలాదిగా జనం తరలి వ చ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జనసమీకరణ కోసం వందల బస్సులను ఏర్పాటు చేసింది. ఉదయం ఏడున్నర నుంచే జువ్వలపాలెం రహదారి జనంతో కోలాహాలంగా మారింది. తొమ్మిది గంటలకే సభా ప్రాంగణం నిండిపోవడంతో తర్వాత వచ్చిన వారిని లోనికి అనుమతించలేదు. ప్రాంగణంలో ఉన్న వారికంటే అంతకుమించి జనం సభ వెలుపల ఉన్నారు. ఎనిమిది గంటల నుంచే సభా ప్రాంగణానికి విచ్చేసిన జనాలను ఆకట్టుకునేందుకు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పా టు చేశారు. జాతి సమైక్యత దేశ భక్తి భారతదేశ సంస్కృతి ఉట్టి పడేలా విద్యార్థులు జాతీయ స్ఫూర్తిని రగిలించాయి. ప్రధాని మోదీ ఉదయం 11.15 గంటలకు సభ వేదిక వద్దకు చేరుకున్నారు. అంతకు ముందే గవర్నర్‌ బిశ్వభూషణ్‌హరిచందన్‌, సీఎం జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మెగాస్టార్‌ చిరంజీవి వేదికపైకి వచ్చారు. చిరంజీవి, కిషన్‌రెడ్డి, జగన్‌ ప్రసంగించిన తర్వాత 11.40 గంటలకు ప్రధాని మోదీ 41 నిమిషాల పాటు ఉపన్యసించారు. అల్లూరి, గంటం దొర వారసులను సత్కరించారు.వినమ్రంగా అభివాదం చేశారు. స్వాతంత్ర పోరాటంలో సర్వం త్యాగం చేసి జైలుకు వెళ్ళిన పసల కృష్ణమూర్తి, అంజి లక్ష్మిల కుమార్తె కృష్ణభారతికి ప్రధాని పాదాభివందనం చేశారు. అతిఽథులంతా అల్లూరి స్వాతంత్య్ర కాంక్ష, ఆశయ సాధన కోసమే ప్రసంగించారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల వాసులు అల్లూరి జయంతి వేడుకలను టీవీల ద్వారా చూసేందుకు ఆసక్తి కనబరిచారు. 


సాంస్కృతిక సమ్మేళనం

భీమవరం/కాళ్ల/భీమవరం రూరల్‌, జూలై 4 : సభా ప్రాంగణంలో పలు విద్యా సంస్థలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నా యి. విష్ణు ఎడ్యుకేషన్‌ సంస్థ విద్యార్థులు భారతీ య పిరమిడ్‌ సంస్కృతిపై ప్రదర్శన చేశారు. దశావతారాల నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దేశంలోని అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు ఒక్కటేనం టూ భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు అస్సోం, గుజరాతీ, పంజాబ్‌, కేరళ జానపద కళలను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. అల్లూరి సీతారామరాజు మన్యం వీరులతో కలిసి బ్రిటీషర్లతో పోరాడిన ప్రదర్శన ఘట్టం చూపరులను ఎంతో ఆకట్టుకుంది. వందేమాతరం అంటూ చేసిన కూచిపూడి, మణిపురి, కథాకళి ప్రదర్శనలతో అల్లూరి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. జాతీయ నాయకుల వేషధారణలతో విద్యార్థులు సభా స్థలి వద్ద సందడి చేశారు.  


మహిళల నిరాశ 

మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు స్థలంలో హెలీప్యాడ్లు ఏర్పాటు చేయడం వల్ల పోలీసులు ప్రధాన రహదారిని నిర్బంధించారు. పలు గ్రామా ల నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాలు నిలి చిపోవడంతో సభా ప్రాంగణానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మోదీ చూద్దామని తెల్లవారు జాము నుంచి బస్సుల్లో వచ్చిన మహిళల ఆశ నిరాశ అయింది. సభా ప్రాంగణం వద్దకు దూర ప్రాంతాల నుంచి రావడానికి గంటల సమయం పట్టడంతో అప్పటికే సభ నిండుకోవడంతో పోలీ సులు  చాలాదూరం నుంచి మహిళలను నిలిపి వేశారు. అప్పటికే బస్సులు అందుబాటులోకి లేక పోవడంతో పట్టణంలోని ఖాళీ స్థలాలు, షాపుల మెట్ల వద్ద సభ పూర్తయ్యే వరకు గడపారు.  


వేదికపై సందడి

ప్రధాని రావడానికి గంటన్నరపైగా ఉండటంతో అప్పటికే వేదికపై విచ్చేసిన మంత్రి రోజా సందడి చేశారు. కలెక్టర్‌ పి.ప్రశాంతి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరితో మాట్లాడారు. ఆపై ఆమె తో వేదికపై ఆసీనులయ్యారు. వేదికపై గంటసేపు ఉన్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని పదే పదే సూచనలు చేశారు. తరచూ సభికులను ఉత్సా హపరిచారు. ఐదు రోజులుగా కు రుస్తున్న వర్షాలు ఆందోళనకు గురి చేసినా చివరి రోజు వర్షాలు తగ్గి, సోమవారం చినుకులు పడకపోవడం సభ విజయవంతంలో కీలకమైంది. కార్యక్రమాల నిర్వహణలో అధికారులు అహోరాత్రులు శ్రమించి, ఫలితాలను సాధించారు. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో నడిపించారు. 


ప్రముఖుల హాజరు

వేదికపై ప్రధాని నరేంద్రమోదీతోపాటు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి దాడిశెట్టి రాజా, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా, కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరి, సినీ హీరో చిరంజీవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు ఉన్నారు. సభలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉండి, పాలకొల్లు ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, నిమ్మల రామా నాయుడు, చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, బీజేపీ ఎమ్మెల్సీ వాకాడ నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, బీజేపీ నేతలు పాకా వెంకట సత్యనారాయణ, భూపతిరాజు శ్రీనివాసవర్మ, సుభాష్‌రాజు, నార్ని తాతాజీ, కపర్దీ, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఏఎస్‌ రాజు, ఎంపీపీ పేరిచర్ల నరసింహరాజులతో పాటు క్షత్రియ పరిషత్‌ నాయకులు పలువురు పాల్గొన్నారు. 


అల్లూరి స్ఫూర్తితో ముందుకు..

కేంద్ర పర్యాటకశాఖ మంత్రి  కిషన్‌రెడ్డి పిలుపు

భీమవరం : అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. అల్లూరి స్ఫూర్తితో యువత ముందుకు నడవాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని సభ ముగిసిన తర్వాత సోమవారం సాయంత్రం కిషన్‌రెడ్డి స్థానిక ఏఎస్‌ఆర్‌ నగర్‌లో ఆవిష్కరించిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ జేవీ మురళి, బీజేపీ నాయకులు సునీల్‌ థియోదర్‌, సోము వీర్రాజు, జీవీఎల్‌ నరసింహరావులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ భావంతో విద్యార్థులు, ప్రజలు విగ్రహాన్ని దర్శించుకునేలా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అల్లూరి జయంతి ఉత్సవాలు వాడవాడలా ఏడాది పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలో హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ, ఒడిశాలలో అల్లూరి జయంతి ఉత్సవాల నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం విజయవతం కావడంతో జిల్లా యంత్రాంగానికి, మంత్రులకు ఎమ్మెల్యేలకు, ప్రజా ప్రతినిధులకు, క్షత్రియ సేవా సమితికి, వలంటరీ సంస్ధలకు ధన్యవాదాలు తెలిపారు. ముగింపు ఉత్సవాలకు నూతన రాష్ట్రపతిని భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. ఆర్డీవో దాసిరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద సోమవారం సాయంత్రం ఐదు  గంటల నుంచి వందలాది మంది సందర్శకులు వచ్చి సెల్ఫీలు, ఫోటోలు తీయించుకుంటున్నారు. విద్యుత్‌ దీపాలతో అలంకరించడంతో విశేషంగా ఆకట్టుకుంది. 


ఆహ్వానించి అవమానిస్తారా?

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే మంతెన 


భీమవరం అర్బన్‌/ఆకివీడు, జూలై 4 : అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ఆహ్వానించి తమను అవమానించారని ప్రతిపక్ష నాయకుడు అచ్చెన్నాయుడు, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ‘మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రొటోకాల్‌ పూర్తిగా మంట కలిసింది. ప్రధాని సభ లోనే ప్రొటోకాల్‌ ఉల్లంఘించడం బాధాకరం. స్థాని క ఎంపీ రఘు రామకృష్ణంరాజు సభకు అధ్యక్షత వహించాలి. ఆయనకూ ఆహ్వానం అందలేదు. ఇది దురదృష్టకరం’ అని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానం మేరకు సభకు వచ్చానని, నిన్నటి వరకు ప్రొటోకాల్‌ లిస్టులో తన పేరు ఉందని, ఆదివారం రాత్రి లేదని, కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి కార్యాలయం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కలెక్టరు తన పేరు తీసేయడం వల్ల కార్యక్రమానికి ప్రత్యక్షంగా వెళ్లలేకపోయానన్నారు. ప్రధాని భద్రత పర్యవేక్షించే ఎస్పీజీ, డీఐజీకి ఇచ్చిన జాబితాలో అచ్చె న్నాయుడు పేరుందని చెప్పినా కలెక్టర్‌ పట్టించుకోలేదని రామరాజు అన్నారు. దీంతో ఆయన అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వెళ్లిపోయారన్నా రు. తన నియోజకవర్గం పెద అమిరంలో సభ జరిగిందని, ఎమ్మెల్యేనైన తనను అవమానించారన్నారు. ప్రతిపక్ష నేతలను పిలిచి  అవమానించడమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశమా? అని ప్రశ్నిం చారు. 






Updated Date - 2022-07-05T06:09:31+05:30 IST