అల్లూరి స్ఫూర్తితో పోరాడాలి: సీఐటీయూ

ABN , First Publish Date - 2022-07-04T05:02:54+05:30 IST

ప్రతి ఒకరు అల్లూరి స్ఫూర్తితో పోరాడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు.

అల్లూరి స్ఫూర్తితో పోరాడాలి: సీఐటీయూ
అల్లూరి విగ్రహం వద్ద నిరసనలు తెలుపుతున్న సీఐటీయూ నాయకులు

రైల్వేకోడూరు రూరల్‌, జూలై 3: ప్రతి ఒకరు అల్లూరి స్ఫూర్తితో పోరాడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సంద ర్భంగా ఆదివారం పట్టణం లోని టోల్‌గేట్‌ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి విగ్రహం అవిష్కరణ చేసే హక్కు నరేంద్ర మోడీకి లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం చేసిందన్నారు. విభజన చట్టంలో హామీలు కానీ, ప్రత్యేక హోదా, కడప ఉక్కు, వెనుక బడిన రాయలసీమ ప్రాంతాల ప్యాకేజీ, పోలవరం, రాజఽఽధానికి నిధులు ఇవ్వడంలో  తీరని ద్రోహం చేసిన నరేంద్ర మోడీకి రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కులేదని ధ్వజమెత్తారు. అనంతరం నరేంద్ర మోడీ గో బ్యాక్‌, విప్లవం వర్ధిల్లాలి, అల్లూరి సీతారామరాజు ఆశయాలను సాధిస్తాం అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు మోడీ సుబ్బరామయ్య, సీపీఎం నాయకులు లింగాల యానాదయ్య, సీఐటీయూ మండల కన్వీనర్‌ దాసరి జయచంద్ర, ఆవాజ్‌ కన్వీనర్‌ పి.మౌలాలి బాషా,ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జాన్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:02:54+05:30 IST