గణపవరంలో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసిన పురందేశ్వరి
కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి
గణపవరం, జూలై 4: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయనను స్మరించుకోవడం గర్వకారణమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. సోమవారం గణపవరం, పిప్పర, కాశిపాడు, అర్థవరం గ్రామాల్లో అల్లూరి 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అల్లూరి విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ మోటార్ సైకిల్ ర్యాలీ, బస్సుర్యాలీని ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జెండా ఊపి ప్రారంభిం చారు. చెరుకువాడ నరేష్, ఎంపీపీ దండు వెంకటరామరాజు, దండు రాము, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నంద్యాల రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు.